Tamannaah Give Hint On Her Marriage

Tamannaah: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌సరం లేదు. సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న త‌మ‌న్నా.. సుధీర్గ కాలం నుంచి చేతి నిండా ప్రాజెక్ట్‌ల‌తో కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తోంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. కెరీర్ గురించి ప‌క్క‌న పెడితే.. త‌మ‌న్నా ప్ర‌స్తుతం బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మతో ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tamannaah Give Hint On Her Marriage

గ‌త ఏడాది విడుద‌లైన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో విజ‌య్ వ‌ర్మ‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించారు. ఈ సిరీస్ ద్వారా ఏర్ప‌డ్డ ప‌రిచ‌య‌మే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌గా మారింది. ఓ పార్టీలో తమన్నా, విజయ్ కిస్సింగ్ ఫొటోస్ లీక్ అవ్వగా వీరి ల‌వ్ మ్యాట‌ర్ బ‌య‌ట‌ప‌డింది. దాంతో చేసేదేమి లేక వారిద్ద‌రూ త‌మ రిలేష‌న్ పై ఓపెన్ అయిపోయారు. మేము ప్రేమలో ఉన్నామ‌ని.. డేటింగ్ చేస్తున్నాం అని క్లారిటీ ఇచ్చారు.

Tamannaah Give Hint On Her Marriage

పెళ్లి టాపిక్ తెస్తే మాత్రం అటు విజ‌య్ వ‌ర్మతో పాటు ఇటు త‌మ‌న్నా కూడా మాట దాట‌వేస్తున్నారు. విజ‌య్ వ‌ర్మ వ‌య‌సు 40కి చేరువ‌వుతోంది. ఇటు త‌మ‌న్నాకు కూడా 34 ఏళ్లు వ‌చ్చేశాయి. ఈ నేప‌థ్యంలోనే వీరిద్ద‌రూ పెళ్లికి ఎప్పుడెప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా అని ఫ్యాన్స్‌ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న‌టి మొన్న‌టి వ‌ర‌కు సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేసిన త‌మ‌న్నా తాజాగా దేవాల‌యాల ద‌ర్శ‌న‌లో మునిగిపోయింది.

Also Read: Prabhas-Sreeleela: ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్రీ‌లీల‌.. ఆ పాన్ ఇండియా మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్‌!?

కుటుంబ సభ్యులతో పాటు గౌహ‌తిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన తమన్నా.. అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించింది. ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌లేని విధంగా డివోషనల్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. దీంతో త‌మ‌న్నా పెళ్లి వార్త‌లు మ‌ళ్లీ ఊపందుకున్నాయి. ఈ ఏడాది విజ‌య్ వ‌ర్మతో మిల్కీ బ్యూటీ ఏడ‌డుగులు వేయ‌డం ఖాయ‌మ‌ని.. అందులో భాగంగానే త‌మ‌న్నా పెళ్లికి ముందు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి త‌మ‌న్నా చేస్తున్న ఈ పూజ‌లు నిజంగా త‌న పెళ్లికి ఇచ్చిన హింటేనా.. కాదా.. అన్న‌ది తెలియాల్సి ఉంది. (Tamannaah)

Join WhatsApp