Tantra Movie Review And Rating

Review: నటీనటులు: అనన్య నాగళ్ల, ధనుశ్ రఘుముద్రి, సలోని, మీసాల లక్ష్మణ్, టెంపర్ వంశీ, మనోజ్ ముత్యం తదితరులు
సంగీత దర్శకుడు: ఆర్ఆర్ ద్రువన్
సినిమాటోగ్రాఫర్: శ్రీరామ్ ఉద్ధవ్
ఎడిటర్ : SB ఉద్దవ్
నిర్మాత: నరేష్ బాబు, రవి చైతన్య
దర్శకత్వం: శ్రీనివాస్ గోపిశెట్టి
విడుదల తేదీ: 15 మార్చి 2024

Tantra Movie Review And Rating

“మసూద”, “విరూపాక్ష” వంటి సినిమాలు తాంత్రిక విద్య, ఆధ్యాత్మిక పూజల నేపథ్యంలో వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఈ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కలెక్షన్స్ పరంగా కూడా అవి పెద్ద హిట్ అయ్యాయి. అలాంటి జానర్ చిత్రమే “తంత్ర”. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఈరోజే విడుదలైంది. ‘మల్లేశం’, ‘ప్లే బ్యాక్’, ‘వకీల్ సాబ్’ లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్న నటి అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించగా ఈ సినిమా అప్డేట్ లు సినిమాపై అంచనాలను పెంచాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ: ఓ పల్లెటూరి లో తల్లి లేకుండా నానమ్మ, తండ్రితో కలిసి పెరిగిన రేఖ (అనన్య నాగళ్ళ) అదే ఊరిలో ఉన్న తేజు(ధనుశ్ రఘుముద్రి) ను ప్రేమిస్తుంది. అదే సమయంలో తన స్నేహితులిపై చేయబోతున్న క్షుద్ర ప్రయోగం గురించి తెలుసుకుని ఆమెను తప్పిస్తుంది. దాంతో ఆమెపై పగతో విగతి (టెంపర్ వంశీ) ఓ కొత్త క్షుద్ర విద్యను ప్రయోగిస్తాడు. అదే సమయంలో ఆమె ఓ పిశాచికి రక్త దాహం తీర్చుకోవడానికి రక్తాన్ని ఇస్తుంటుంది రేఖ. అసలు రేఖ ఎవరు..? ఆమెపై చేసిన క్షుద్ర ప్రయోగం చివరికి ఏమైంది అనేదే ఈ సినిమా కథ.

నటీనటులు: అమాయక పల్లెటూరి అమ్మాయిగా అనన్య నాగళ్ల ఎంతో మంచి నటన కనపరిచింది. క్లైమాక్స్‌లో కొన్ని సన్నివేశాలలో, ఆమె నటన ఆకట్టుకుంది. అనన్య ఇటు నటనలో, అటు ప్రజెన్స్ లో మంచి మార్కులు కొట్టేసింది. తప్పకుండా పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. హీరోగా నటించిన ధనుష్ రఘుముద్రి కొత్తవాడైన బాగా నటించాడు. టెంపర్ వంశీ తాంత్రిక వేషధారణ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు చేసిన అమ్రిష్ పూరి మరియు రామి రెడ్డి వంటి వారిని గుర్తు చేశాడు. మిగితా వారు తమ పాత్ర మేరకు బాగా నటించాడు.

సాంకేతిక నిపుణులు: దర్శకుడు మంచి స్టోరీ పాయింట్‌ రాసుకున్నాడు. అయితే అమలులో కొంత తడబాటు ఉందనే చెప్పాలి. సంగీత దర్శకుడు 100% న్యాయం చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి కథ చాలా బాగా తయారుచేసుకున్నాడు. తాంత్రిక విద్య , మంత్రాల నేపధ్యంలో కొన్ని క్యూరియాసిటీ పాయింట్లు ఉన్నప్పటికీ, సినిమా నెమ్మదిగా వెళ్లడం కొన్ని చోట్లా నచ్చదు. కథాంశంలో హారర్ కథకు అవసరమైన అన్ని అంశాలు ఉన్నాయి. మంచి విజువల్స్ ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

కథ, కథనం

సినిమాటోగ్రఫీ

ఇంటర్వెల్ సీక్వెన్స్

మైనస్ పాయింట్స్:

ఎడిటింగ్

సాగతీత

రేటింగ్ : 3/5

Join WhatsApp