Tarak "Devara" movie story leak Thandel

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న తారక్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయ్యాడని చెప్పొచ్చు.

Tarak “Devara” movie story leak

అంతకుముందు అనేక సినిమాలు చేసినప్పటికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆర్ఆర్ఆర్ మూవీ మంచి ట్రీట్ ఇచ్చింది. ఇక తారక్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న మూవీ ” దేవర “. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అతిలోక సుందరి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

Also Read:Janhvi Kapoor: ” ఆ హీరో నాకంటే చిన్న పిల్లాడి లాగా ఉన్నాడు “.. ఆ స్టార్ హీరో లుక్ పై ఆసక్తికర కామెంట్లు చేసిన జాన్వి..!

ఇదిలా ఉంటే.. తాజాగా దేవర సినిమా స్టోరీ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా స్టోరీ మొత్తం.. తండ్రి, కొడుకు మధ్య నడుస్తుందట. ఎన్టీఆర్ ని తన తండ్రి చాలా పద్ధతిగా పెంచాలనుకుంటాడు.. కానీ ఎన్టీఆర్ మాత్రం అందుకు విరుద్ధంగా అన్యాయం చేసే వాళ్లని సహించడు. ప్రతి ఒక్కడిని కొడుతూ తనలో ఉన్న హీరోని చూపించుకుంటాడు. దీంతో తన తండ్రి ఎన్టీఆర్ ని బయటకి గెంటేస్తాడు.

Tarak "Devara" movie story leak

ఇక అప్పుడే ఎన్టీఆర్ సముద్రం పక్కన బ్రతుకుతాడట. ఇక తనని చంపాలని వచ్చిన వాళ్ళని అక్కడే చంపేసి ఆ సముద్రంలో కలిపేస్తాడు. దీనిని మనం గ్లింప్స్ లో చూసాము. ” ఈ సముద్రం చేపల కన్నా నెత్తురునే ఎక్కువ తాకుతుంది ” అనే డైలాగ్ తో గూస్బంస్ తెప్పించాడు తారక్. ఇక సముద్రం, తారక్ మధ్య జరిగే యుద్ధమే దేవర అట. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఇది చూసిన తారక్ అభిమానులు టెన్షన్ కి గురయ్యారు.(Devara)

Join WhatsApp