Teja Sajja Rejected 75 Movies For Hanuman

Teja Sajja: తేజ స‌జ్జా.. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన హ‌నుమాన్ మూవీతో ఈ యువ హీరో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తేజ స‌జ్జా.. జాంబీ రెడ్డి మూవీతో హీరోగా మారాడు. తొలి సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత ఇష్క్‌, అద్భుతం వంటి చిత్రాల‌తో అల‌రించిన తేజ‌.. ఇటీవ‌ల హ‌నుమాన్ మూవీతో ప‌ల‌క‌రించాడు. సూప‌ర్ హీరో కాన్సెప్ట్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

Teja Sajja Rejected 75 Movies For Hanuman

తొటి ఆట నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించింది. ఇప్పటికే రూ.290 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబ‌ట్టి అద‌ర‌హో అనిపించిన హ‌నుమాన్‌.. ఇంకా థియేట‌ర్స్ లో ర‌న్ అవుతుండ‌టం విశేషం. ఇక‌పోతే హ‌నుమాన్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన తేజ స‌జ్జా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. సినిమా గ్రాండ్ స‌క్సెస్ అవ్వ‌డంపై ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రిచాడు. అలాగే మ‌రెన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నాడు.

హ‌నుమాన్ మూవీ కోసం తాను 70 నుంచి 75 చిత్రాలను వ‌దులుకున్నాన‌ని ఓ షాకింగ్ మ్యాట‌ర్ ను రివీల్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. తేజ మాట్లాడుతూ.. ఓ సినిమా కోసం ఏ నటుడైనా రెండు మూడు లుక్ లెస్టులు ఇస్తారు. కానీ హ‌నుమాన్ కోసం దాదాపు 25 లుక్ టెస్టులు ఇచ్చాను. అలాగే ఈ మూవీ కోసం ఏకంగా రెండున్నరేళ్ల పాటు షూటింగ్ చేశాము. ఈ టైమ్ లో నా వ‌ద్దకు వచ్చిన 70 నుంచి 75 ప్రాజెక్టులను వ‌దులుకున్నాను.(Teja Sajja)

Also Read: Trisha: 18 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మెగాస్టార్ తో జ‌త‌క‌డుతున్న త్రిష.. హాట్ టాపిక్‌గా రెమ్యున‌రేష‌న్‌!

అందులో కనీసం 15 ప్రాజెక్టులు నాకు ఎంతో న‌చ్చినా.. హ‌నుమాన్‌కు కంప్లీట్ గా కమిట్ అయినందుకు నో చెప్పాను. ఇక ఈ చిత్రంలో స్టంట్స్ అన్నీ నేనే చేశాను. బాడీ డబుల్ లేదా వీఎఫ్ఎక్స్ వంటివి ఏమీ ఉప‌యోగించ‌లేదు. నీటి లోపల సీక్వెన్స్ షూట్ చేయ‌డానికి స్కూబా డైవింగ్ కూడా నేర్చుకున్నాను` అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డానో వివ‌రించాడు. తేజ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారయ‌డంతో.. నెటిజ‌న్లు షాకైపోతున్నారు. ఒక్క సినిమా కోసం అన్ని సినిమాలు వ‌దిలేసిన తేజ‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఏదేమైనా తేజ క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం హ‌నుమాన్ తో వ‌చ్చేసింది. ఈ చిత్రం అత‌ని కెరీర్ లోనే చిరస్థాయిగా మిగిలిపోతుంది అన‌డంలో సందేహం లేదు.

Join WhatsApp