Telugu Fan Who Gave Unexpected Surprise To Actress Mamitha Baiju

Mamitha Baiju: రీసెంట్ టైమ్ లో మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేసిన చిత్రాల్లో ప్రేమ‌లు ఒక‌టి. గిరీష్ ఏడీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల‌ను పోషించారు. ఫిబ్ర‌వ‌రి 9న మ‌ల‌యాళంలో విడుద‌లైన ఈ యూత్‌పుల్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ భారీ విజ‌యాన్ని అందుకుంది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి రూ. 100 కోట్ల రేంజ్‌లో వ‌సూళ్ల‌ను అందుకుంది. దాంతో ప్రేమ‌లు చిత్రాన్ని తెలుగులో రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ రిలీజ్ చేశాడు.

Telugu Fan Who Gave Unexpected Surprise To Actress Mamitha Baiju

తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ప్రేమ‌లు మూవీతో హీరోయిన్ మ‌మితా బైజు ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ లో కుర్ర‌కారుకు న్యూ క్ర‌ష్ గా మారిపోయింది. ప్రేమ‌లు చిత్రంలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌ రీనూ పాత్ర‌లో మ‌మితా అద‌ర‌గొట్టేసింది. త‌న అందం, అభిన‌యం మ‌రియు క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ లో ప్రేక్ష‌కుల హృద‌యాలు దోచేసింది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సైతం గీతాంజలి, సాయి ప‌ల్ల‌వి వంటి హీరోయిన్ల‌తో పోలుస్తూ మ‌మితాపై ప్ర‌శంస‌లు కురిపించారు.

దీంతో సోష‌ల్ మీడియాలో మ‌మితా బైజు గ‌త కొద్ది రోజుల నుంచి ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. యూత్‌లో ఎంతో మంది ఆమె అభిమానులుగా మారిపోయారు. అయితే తాజాగా మ‌మితాకు ఓ తెలుగు అభిమాని నుంచి వింత అనుభ‌వం ఎదురైంది. ప్రేమ‌లు సినిమా తెలుగులోనూ మంచి విజ‌యం సాధించ‌డంతో తాజాగా స‌క్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో చీరకట్టులో కనిపించి మ‌మితా అంద‌రినీ ఆక‌ట్టుకుంది.(Mamitha Baiju)

Also Read: Rashmika Mandanna: ర‌ష్మిక‌కు అవంటే అంత ఇష్ట‌మా.. ఫారెన్ వెళ్తే కొన‌కుండా అస్స‌లు రాద‌ట‌!!

అయితే స‌క్సెస్ మీట్ లో ఓ తెలుగు అభిమాని ఓ షాకింగ్‌ సర్ ప్రైజ్ ఇచ్చాడు. మమితా అంటే చాలా అభిమానమ‌ని చెబుతూ స్టేజీ పైకి వచ్చాడు. ఆపై ఎవ‌రూ ఊహించ‌ని విధంగా స‌ద‌రు అభిమాని పళ్లెంలో మ‌మితాకు హారతి ఇచ్చాడు. స‌ద‌రు అభిమాని చేసిన పనికి మ‌మితాతో పాటు అక్క‌డ ఉన్న‌వాళ్లంతా ఆశ్చ‌ర్య‌పోయారు. మ‌మితాకు ఏం చేయాలో అర్థంగాక అలానే నిల‌బ‌డిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ కావ‌డంతో.. ఇదేం అభిమానం రా బాబు అంటూ నెటిజ‌న్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Join WhatsApp