The baby beauty who got a chance in the movie Balayya

Balayya: నందమూరి నట సింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వందకి పైగా సినిమాలలో నటించిన బాలయ్య ప్రస్తుత కాలంలో కూడా యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య లైన్ అప్ లో ఉన్న సినిమాలలో బాబీ తో ఒకటి.. అఖండకి సీక్వెల్ గా అఖండ 2 ఒకటి. ఇక బోయపాటి, బాలయ్య కాంబినేషన్ ఆల్రెడీ ఒకసారి చూశారు కనుక ఈ సినిమాపై బాలయ్య అభిమానులకి పెద్దగా ఆత్రుతలేదు.

The baby beauty who got a chance in the movie Balayya

కానీ బాబీ డైరెక్షన్లో బాలయ్య నటించబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ లో బాలయ్య గెటప్ డిఫరెంట్ గా ఉండనుందట. అదేవిధంగా ఈ సినిమాలో నాని హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూన్న‌ సంగతి తెలిసిందే. ఇక దీనిపై చిత్ర బృందం ఏ మాత్రం స్పందించలేదు. ఇక తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read:Dilraju: దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. ఆ స్టార్ హీరోకి ప్రత్యేక ఆహ్వానం..!

అదేంటంటే.. ఒక్క సినిమాతోనే భారీ పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బేబీ మూవీలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ భారీ హిట్ అవడంతో వరుస సినిమా అవకాశాలు కూడా ఈమెకి దక్కుతున్నాయి. ఇక తాజాగా వైష్ణవి చైతన్య కి బాలయ్య సినిమాలో ఛాన్స్ దక్కినట్లు తెలుస్తుంది. ఈమె బాలయ్య సినిమాలో ఓ సైడ్ క్యారెక్టర్ చేయనుందట.

The baby beauty who got a chance in the movie Balayya

ఇక ఇదే కనుక నిజం అయితే వైష్ణవి చైతన్య దిశ మారిందనే చెప్పొచ్చు. సాధారణంగా బాలయ్య పక్కన నటించిన ప్రతి యాక్టర్ కి కూడా మంచి గుర్తింపు దక్కుతుంది. ఇక అదే విధంగా వైష్ణవి చైతన్య సైతం బాలయ్య సినిమాలో నటిస్తే ఈమెకి తిరిగే ఉండదు. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే..” నిజంగా వైష్ణవి చైతన్య బాలయ్య సినిమాలో నటిస్తే బేబీ లాంటి 100 సినిమాలు ఈమె కాళ్ల దగ్గరికి వస్తాయి. మరి వీరిద్దరి కాంబినేషన్లో ఏ సీన్ పండుతుందో చూడాలి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.(Balayya)

Join WhatsApp