The fight between Krishna and Nagma

Nagma: అప్పటి స్టార్ హీరోయిన్ అయిన నగ్మా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవితాన్ని గడుపుతుంది. అయితే అప్పట్లో నగ్మా సినిమా షూటింగ్ టైం లో చాలా పొగరుగా ఉండేదని,ఎవర్ని లెక్క చేయకపోయేదనే టాక్ వినిపించింది. అంతేకాదు శోభన్ బాబు, చిరంజీవి వంటి హీరోల దగ్గర కూడా పొగరుగా వ్యవహరించడం తో వాళ్లు ఆమె తోక కత్తిరించారు అంటూ అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి.ఇక ఈ ఇద్దరు హీరోల దగ్గరే కాదు నగ్మా కృష్ణ తో ఓ సినిమా చేసే సమయంలో కూడా అలాగే పొగరుగా వ్యవహరించిందట.

The fight between Krishna and Nagma

చివరికి ఆ సినిమా నుండి హీరోయిన్ నగ్మాని తీసేశారు. ఇక విషయంలోకి వెళ్తే.. నగ్మా కృష్ణ కాంబినేషన్లో భరత సింహం అనే సినిమా రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నగ్మాకి నిర్మాతతో గొడవ జరగడంతో షూటింగ్ కి రాలేదట. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో రెండు పొట్టి బికినీలు నగ్మా వేసుకోవాల్సి ఉందట.అయితే ఈ బికినీ లను నగ్మా నే తెచ్చుకోమని డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి చెప్పారట.దాంతో ప్రొడ్యూసర్ కూడా నగ్మా కి ఈ విషయం చెప్పగా నగ్మా రెండు పొట్టి బికినీలు తెచ్చుకొని వాటికి 60 వేల బిల్లు చూపించిందట. (Nagma)

Also Read: Anjali: విడాకులైన ప్రొడ్యూస‌ర్ తో హీరోయిన్ అంజ‌లి డేటింగ్‌.. త్వ‌రలో పెళ్లి..?!

ఇక 60,000 బిల్లు చూసి ఆశ్చర్యపోయిన నిర్మాత ఆ డబ్బులను ఇవ్వడానికి వెనకడుగు వేశారట. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. ఇక ఈ గొడవ పెద్దదవుతుందని తెలుసుకున్న దర్శకుడు సాగర్ నేనే ఆ డబ్బులు పే చేస్తాను అని చెప్పినా కూడా నగ్మా వినకుండా నాకు ప్రొడ్యూసర్ ఇస్తేనే తీసుకుంటాను అని మొండిపట్టు పట్టిందట. దాంతో డైరెక్టర్ సాగర్ నగ్మాని చెడా మడా తిట్టేసారట. ఇక కోపంలో నగ్మా షూటింగ్ వదిలేసి ఇంటికి వెళ్లి ఎంతమంది చెప్పినా కూడా రాలేదట.

The fight between Krishna and Nagma

ఇక ఈ విషయంలో హీరో కృష్ణ నే కల్పించుకొని షూటింగ్ కి రమ్మని చెప్పిన కూడా వినక పోయేసరికి సినిమా స్క్రిప్ట్ మొత్తం మార్చేసి ఆమె పాత్రను మార్చేశారట. కానీ భరత సింహం మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాఫ్ అయింది.. అంటూ డైరెక్టర్ సాగర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. ఈ సినిమా తర్వాత మళ్లీ సాగర్ తన దర్శకత్వంలో చేసే ఏ సినిమాలో కూడా నగ్మాని తీసుకోలేదట. అంతేకాదు కృష్ణ కూడా నగ్మా చేసిన పనికి ఆమె మీద కోపం తెచ్చుకొని ఏ సినిమాలో కూడా కలిసి చేయలేదట.అయితే నాగార్జున వారసుడు మూవీలో కృష్ణ నటించినప్పటికి ఇందులో నగ్మా కూడా నటించింది.కానీ నాగార్జునకి జోడిగా నగ్మా చేసింది.(Nagma)

Join WhatsApp