The first Telugu hero that Rashmika loved

Rashmika: ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్ళిపోయింది రష్మిక మందన్నా.. ఇక పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ అయింది. ఇక రీసెంట్ గా వచ్చిన యానిమల్ మూవీ లో బోల్డ్ గా నటించి చాలామంది యూత్ కి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.అయితే అలాంటి రష్మిక తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతో మంది కుర్రకారుని పడగొట్టేసింది.

The first Telugu hero that Rashmika loved

ఇక రష్మిక ప్రేమించిన అబ్బాయి అనే పేరు చెప్పగానే అందరికీ విజయ్ దేవరకొండ మాత్రమే గుర్తుకొస్తారు. కానీ రష్మిక విజయ్ దేవరకొండ కంటే ముందే మరో తెలుగు హీరోని ప్రేమించిందట.అయితే ఈమె కన్నడలో హీరో అయిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ చేసుకుంది.కానీ కొన్ని కారణాల వల్ల ఎంగేజ్మెంట్ రద్దు చేసుకొని మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయింది.అయితే రక్షిత్ శెట్టితో బ్రేకప్ తర్వాత తెలుగులో ఛలో మూవీ చేసింది.( Rashmika)

Also Read: Kareena Kapoor: నేను రిజెక్ట్ చేయడం వల్లే దీపిక పదుకొనే రణ్ వీర్ కి భార్య అయింది..!

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రష్మిక మందన్నా నాగశౌర్య మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి చాలామంది ఇండస్ట్రీ జనాలు వీరి మధ్య ఏదో నడుస్తోందని గుసగుసలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ కూడా బాగుండడంతో వీరిపై ఎఫై** వార్తలు ఎక్కువ అయ్యాయి.కానీ ఈ విషయంలో నాగశౌర్య గానీ,రష్మిక గానీ అప్పట్లో క్లారిటీ ఇవ్వలేదు.

 The first Telugu hero that Rashmika loved

దాంతో వీరిద్దరి మీద రిలేషన్ వార్తలు జోరుగా చక్కర్లు కొట్టడంతో రష్మిక మందన్నా నేను నాగశౌర్యతో ప్రేమలో ఉన్నానంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు.కానీ అందులో ఎలాంటి నిజం లేదు.మేమిద్దరం కేవలం షూటింగ్ వరకు మాత్రమే అలా క్లోజ్ గా ఉన్నట్టు నటించాం అంటూ క్లారిటీ ఇచ్చింది.. ఇక ప్రస్తుతం రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ ఇద్దరు ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను బట్టి వెకేషన్ కి ఇద్దరు కలిసే వెళ్తారని అందరూ భావిస్తారు. (Rashmika)

Join WhatsApp