The heroine who believed in Pawan Kalyan and drowned

Pawan Kalyan: టాలీవుడ్ లో ఎప్పుడు ఎవరి గ్రాస్ పెరుగుతుందో.. ఎప్పుడు ఎవరి క్రేజ్ తగ్గుతుందో అస్సలు చెప్పలేం. ఒకసారి అవకాశం వచ్చినా కూడా అది రిలీజ్ దాకా రావడానికి చాలా రోజులే పడుతుంది. ఒక్కోసారి ఏళ్లు గడిచిన విషయం ముందుకు వెళ్లదు. ఇప్పుడు అలాంటి ఒక పరిస్థితుల్లోనే ఓ హీరోయిన్ ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ మూవీ మీద చాలానే ఆశలు పెట్టుకుంది.

The heroine who believed in Pawan Kalyan and drowned

కానీ.. అది ఏమో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉంది. ఎలాంటి తరుణంలో ఆ హీరోయిన్ డార్లింగ్ ప్రభాస్ అవకాశం ఇవ్వడంతో ఆనందంతో సంబరాలు చేసుకుంటుంది. మరి ఆ హీరోయిన్ ఎవరు? అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించే. ఈ అమ్మడు నాగ చైతన్య సవ్యసాచి మూవీలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Also Read: Singer Sunitha: 43 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అంటున్న సింగర్ సునీత.. ఇదేం పోయేకాలం అంటూ కామెంట్స్..!

తన కెరీర్లో మంచి మంచి సినిమాలే చేసిన అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ చెప్పుకోదగా విషయం అయితే అందించింది. ఆ తరువాత మంచి ప్రాజెక్ట్ అంటే పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు అనే చెప్పుకోవచ్చు.‌ అయితే ఈ మూవీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి మూడేళ్లు గడుస్తున్నా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఇలాంటి ఏడాది నుంచి అసలు షూటింగ్ కూడా జరగడం లేదు. అసలు ఈ మూవీ మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా చెప్పలేరు.

The heroine who believed in Pawan Kalyan and drowned

డైరెక్టర్ క్రిష్ ఇంకో సినిమాతో బిజీగా ఉన్నాడు. నిధి మాత్రం మంచి అవకాశాల కోసం చూస్తూ ఉండిపోయింది. అలాంటి తరుణంలోనే ఈ ముద్దుగుమ్మ కి డార్లింగ్ ఓ ఛాన్స్ ఇచ్చాడట. డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెయిన్ లీడ్ లో మాళవిక మోహన్ నటిస్తుంది. అయితే ఆమె కాకుండా ఈ కథలో ఇంకో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. వారిలో నిధి అగర్వాల్ కూడా ఒకరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.(Pawan Kalyan)

Join WhatsApp