the reason why Kovee Sarala is not getting married

Kovee Sarala: సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో మరియు హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ కమెడియన్స్ గా గుర్తింపు తెచ్చుకోవాలంటే వారికి మంచి నటన వచ్చి ఉండాలి. వారి నటనతో ప్రేక్షకులని మైమరిపిస్తేనే వారికి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. కామన్ గా హీరో మరియు హీరోయిన్స్ లుక్స్ ని చూసి డైరెక్టర్ సినిమాలు ఇస్తూ ఉంటారు. కానీ కమెడియన్స్ కి అలా కాదు. వారిలో సరైన యాక్టింగ్ ఉంటేనే వారికి మంచి గుర్తింపు దక్కుతుంది. అలా కమెడియన్ క్యారెక్టర్ లో ఒదిగిపోయి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటీనటులలో బ్రహ్మానందం ఒకరు.

the reason why Kovee Sarala is not getting married

హాస్యానికి పెట్టిన పేరు బ్రహ్మానందం. దాదాపు అన్ని సినిమాలలోనూ బ్రహ్మానందాన్ని పెడుతూ ఉంటారు డైరెక్టర్స్. ప్రస్తుత కాలంలో ఆయనకి ఏజ్ మల్లాడంతో పెద్దగా సినిమాలు చేయడం లేదు. అయినప్పటికీ అప్పుడప్పుడు స్క్రీన్ పై కనిపిస్తూ తన ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు. ఇక అటువంటి బ్రహ్మీకి జోడిగా నటించిన కోవై సరళ కూడా మనందరికీ సుపరిచితమే. అప్పట్లో బ్రహ్మానందం మరియు సరళ జంటకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరి పేర్లను పోస్టర్ పై చూస్తే చాలు ఇక ఆ సినిమా పక్కా సూపర్ హిట్ ఏ అనుకునేవారు ఆనాటి ప్రేక్షకులు.

Also Read: Health: 30 ఏళ్లు మీద పడినవారు తినకూడని ఆహారాలు ఇవే..!

అంతలాగా గుర్తింపు సంపాదించుకున్నారు మరి ఈ జంట. ఇక ప్రస్తుతం సరళ కూడా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్స్ ని మించిన గుర్తింపును సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం మాత్రం ఎటువంటి సినిమాలోనూ కనిపించడం లేదు. ఇక ప్రస్తుతం ఈమె వయసు 62 సంవత్సరాలు. అయినప్పటికీ కూడా ఈమె ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు. ఇక దీనికి కూడా ఓ రీజన్ ఉందట. ఇదేంటంటే.. తన కుటుంబంలో కోవై సరళ నే పెద్ద. ఈమెకి నలుగురు అక్క చెల్లెలు ఉన్నారు.

the reason why Kovee Sarala is not getting married

తాను సంపాదించిన డబ్బంతా కుటుంబానికి పెట్టి.. ఏనాడూ కూడా స్వార్థంగా ఆలోచించలేదు. తన నలుగురు చెల్లెళ్లకు దగ్గరుండి మరి పెళ్లి చేసింది సరళ. ఇక వారికి పుట్టిన పిల్లల బాధ్యతలను కూడా తానే తీసుకుంది. ఈ విధంగా తన చెల్లెల్లు మరియు వారి పిల్లల కోసం తన లైఫ్ని త్యాగం చేసింది సరళ. ప్రస్తుత కాలంలో కన్న తల్లిని పట్టించుకోని జనరేషన్లో చెల్లిల్లు కోసం తన లైఫ్ని త్యాగం చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈమె త్యాగాన్ని చూసిన ఫ్యాన్స్ శభాష్ అంటున్నారు.(Kovee Sarala)

Join WhatsApp