The star heroine who beat Sr.NTR so

Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్ అంటే ఒకప్పుడు చాలామంది హీరోయిన్లకి భయం ఉండేది. హీరోయిన్లకు మాత్రమే కాదు దర్శక నిర్మాతలకు తన సహనటులకు కూడా కాస్త ఒంట్లో వణుకు ఉండేదట.అయితే ఈయన సినిమాల్లోకి రావడానికి ఎంతో కష్టపడి చివరికి కష్టమో నష్టమో ఓర్చి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ స్టేజికి తీసుకువెళ్లారు. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అనే పేరు వస్తే మాత్రం కచ్చితంగా ఎన్టీఆర్ పేరు వస్తుంది.ఈయన ఎన్నో పౌరాణిక, జానపద సినిమాల్లో నటించారు.

The star heroine who beat Sr.NTR so

అయితే అలాంటి గొప్ప నటుడిని ఒక స్టార్ హీరోయిన్ చెంపపై కొడితే చెవి రింగు ఊడిపోయిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు ఎన్టీఆర్ ని కొట్టాల్సి వచ్చింది..వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా.. లేదా సరదాగా జరిగిన సందర్భంలో అలా చేయి చేసుకోవలసి వచ్చిందా…అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ చెవి రింగ్ ఊడిపోయేలా కొట్టిన హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ నటి అంజలీదేవి.. అంజలి దేవి ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు వచ్చాయి.(Sr.NTR )

Also Read: Anil Ravipudi: ట్రోల్స్ కి గురైన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. నువ్వు తీసే బొ**లో సినిమాలకి రావాలా అంటూ కామెంట్స్..!

అలా ఓసారి పల్లెటూరి పిల్ల అనే సినిమా తెరకెక్కించే సమయంలో డైరెక్టర్ సీనియర్ ఎన్టీఆర్ ని చెంపపై కొట్టే ఒక సన్నివేశం గురించి అంజలి దేవికి వివరించారట.అయితే ఆ సన్నివేశంలో సీనియర్ ఎన్టీఆర్ని చెంప మీద దెబ్బ కొట్టాలంటే భయపడి పోయిందట.వామ్మో నేను ఈ సన్నివేశంలో నటించను అని ముందే చెప్పేసిందట. కానీ సినిమా షూటింగ్లో ఇవన్నీ భాగమేనని అలా కొడితేనే సినిమా కాన్సెప్ట్ బాగుంటుందని అంజలీదేవికి నచ్చజెప్పి ఎన్టీఆర్ ని కొట్టమన్నారట. అయితే భయపడుకుంటేనే అంజలీదేవి ఎన్టీఆర్ ను కొట్టిందట.

The star heroine who beat Sr.NTR so

కానీ ఆ చెంప మీద కొట్టే సమయంలో ఆమె సీన్ సరిగ్గా చేయకపోయేసరికి దాదాపు 20 టేకుల వరకు తీసుకున్నారట.అయినా కూడా ఈ సన్నివేశం బాగా రాకపోయేసరికి స్వయంగా ఎన్టీఆర్ రంగంలోకి దిగి మీరు ఎందుకు భయపడుతున్నారు? మనం సినిమా ఆర్టిస్టులం సినిమా కోసం ఏదైనా చేయగలగాలి. మీరు నాకు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ముందు కొట్టండి అని చెప్పారట.దాంతో అంజలీదేవి షార్ట్ రెడీ స్టార్ట్ అనగానే గట్టిగా ఎన్టీఆర్ చెంపపై దెబ్బేసిందట. ఇక అంజలీదేవి కొట్టిన దెబ్బకి ఎన్టీఆర్ చెవి రింగు సైతం ఊడి ఎక్కడో పడిపోయిందట.అలా జరిగిన సమయంలో తాను ఎంతో భయపడ్డాను అంటూ అంజలీదేవి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.(Sr.NTR )

Join WhatsApp