The star heroine who rejected "Premisthe" movie

Premisthe: ప్రేమిస్తే.. ఈ సినిమా ఇప్పుడు టెలివిజన్ లో వచ్చినా చాలామంది కన్నార్పకుండా చూస్తూ ఉంటారు. ఒక తక్కువ జాతి డబ్బు లేని వాడు ఎక్కువ జాతి డబ్బున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వారికి ఎదురైన అనుభవం,కులం మతం పేరుతో ఇద్దరు ప్రేమికులను దూరం చేయడం వంటి సంఘటనలను ఈ సినిమాలో చూడవచ్చు. అయితే ఈ సినిమా నిజ జీవితంలో జరిగిందని ఈ సినిమా డైరెక్టర్ బాలాజీ శక్తివెల్ సినిమా అయిపోయాక ఎండింగ్లో చెప్పుకొస్తారు.

The star heroine who rejected “Premisthe” movie

అయితే ఈ సినిమా నిజజీవితం ఆధారంగానే తెరకెక్కించారని ఆయన చెప్పారు.అయితే ఈ సినిమా చూసీ చాలామంది ప్రేమికుల మనసులు కూడా చలించిపోయాయి. అప్పట్లో ఇలాంటి కులం, మతంతో దూషించి ఎంతోమంది ప్రేమికులను విడదీసారు.అప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలామంది ప్రేమికులకు కులం అనేది అడ్డుగోడగా నిలిచింది.ఇక ప్రేమిస్తే సినిమాలో భరత్,సంధ్యల పేర్లు చాలా ఫేమస్ అయిపోయాయి. (Premisthe)

Also Read: Jyothika: జ్యోతిక సూర్య తండ్రిని అవమానించింది.. తమిళ నటుడి షాకింగ్ కామెంట్స్.!

అంతేకాదు హీరో భరత్ ని ప్రేమిస్తే భరత్ అని,హీరోయిన్ సంధ్యని ప్రేమిస్తే హీరోయిన్ సంధ్య అని పిలవడం స్టార్ట్ చేశారు.అయితే అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ 2004లో వచ్చింది. అయితే ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ సంధ్య పాత్ర కోసం మొదట వేరే హీరోయిన్ ని అనుకున్నారట. ఆమె ఎవరో కాదు ప్రస్తుతం విలన్ గా..అలాగే ఫేమస్ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ లో పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరలక్ష్మికే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట.

The star heroine who rejected "Premisthe" movie

కానీ తన తండ్రి శరత్ కుమార్ ఈసినిమాలో నటించకూడదు అని చెప్పడం కారణంగా ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట. అయితే సినిమా విడుదలయ్యాక వచ్చిన రిజల్ట్ చూసి వరలక్ష్మి కూడా చాలా బాధపడిందట.. సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశానని అనుకుందట. ఇక ఈ విషయాన్ని స్వయంగా వరలక్ష్మి శరత్ కుమారే బయట పెట్టింది. అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ వరలక్ష్మి ఆ పాత్రలో అస్సలు సెట్ అయ్యేది కాదు. ఆమె సినిమాను రిజెక్ట్ చేసి మంచి పనే అయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Premisthe)

Join WhatsApp