The star Heroine who wants to have children without marriage

Heroine: చాలామంది హీరోయిన్లు ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ పిల్లల్ని అయితే కంటున్నారు.అయితే ఇలా రహస్యంగా పెళ్లిళ్లు చేసుకొని పెళ్లి విషయం బయట పెట్టకుండా పిల్లలు కన్నా వాళ్ళు చాలామంది హీరోయిన్లు ఉన్నారు. ఇక రీసెంట్గా ఇలియానా గురించి కూడా ఇలానే మాట్లాడుకున్నప్పటికీ ఆమె పెళ్లి చేసుకున్నాకే అబ్బాయికి జన్మనిచ్చిందని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చింది. అయితే చాలా మంది హీరోయిన్లు పెళ్లి కాకుండానే వారి ఎగ్స్ ని ఫ్రీజ్ చేసి భద్రపరచుకుంటారు.

The star Heroine who wants to have children without marriage

అయితే ఇప్పటికే ఇలా ఉపాసన చేసినట్లు తానే స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా ఇలా పెళ్లి కాకుండానే తన ఎగ్స్ ని ఫ్రీజ్ చేసి భద్రపరుచుకుందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు అలా చేసింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.. నాని హీరోగా చేసిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే మూవీతో తెలుగు చిత్ర సీమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్ ఫిర్జాదా.. ఆ తర్వాత ఈమె ఎంత మంచి వాడవురా,మహానుభావుడు,ఎఫ్2, ఎఫ్3, పంతం,రాజా ది గ్రేట్, అశ్వద్ధామ, చాణక్య, జవాన్,నోటా, రాజా ది గ్రేట్ వంటి ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించింది.(Heroine)

Also Read: Varalakshmi: ఆ ఛానల్ హెడ్ మూడ్ బాగాలేదు రూమ్ బుక్ చేస్తా వస్తావా ఎంజాయ్ చేద్దాం అన్నాడు..!

ఇక కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే ఈమె హర్యానా మాజీ సీఎం మనవడు భవ్య భీష్ణోయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. కానీ చివరికి ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరికీ బ్రేకప్ జరిగి ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకున్నారు.ఆ తర్వాత మెహ్రిన్ మళ్లీ సినిమాల్లో బిజీ అయింది.అలాగే భవ్య భీష్ణోయ్ వేరే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు.

 The star Heroine who wants to have children without marriage

అయితే తాజాగా మెహ్రిన్ తన ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకున్న వీడియో ఒకటి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. తనకి పిల్లల్ని కనడం అంటే చాలా ఇష్టమని, కానీ సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కచ్చితంగా అందం కావాలి కాబట్టి సినిమాల్లో అవకాశాలు ఉన్న సమయంలో పెళ్లి చేసుకోలేకపోయాను.అందుకే నా ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకుంటున్నాను అంటూ మెహ్రిన్ ఫిర్జాదా తన సోషల్ మీడియా ఖాతాలో ఎగ్స్ ఫ్రీజ్ చేసే ప్రాసెస్ మొత్తాన్ని వీడియో రూపంలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.(Heroine)

Join WhatsApp