These are the two movies that hurt Allu Arjun a lot

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును సైతం అందుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నాడు. పుష్ప 2 అనంతరం అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేయబోతున్నాడని జోరుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబో సెట్ అయ్యిందని.. త్వ‌ర‌లోనే అనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ని అంటున్నారు.

These are the two movies that hurt Allu Arjun a lot

ఈ సంగతి పక్కన పెడితే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్‌ ప్రారంభించిన అల్లు అర్జున్ 2003లో గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుంచి ఇప్పటివరకు 20 చిత్రాల్లో నటించాడు. వీటిలో హిట్లు ఉన్నాయి.. అలాగే ఫ్లాప్ అయిన చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే కెరీర్ మొత్తంలో తాను నటించిన ఇర‌వై చిత్రాల్లో అల్లు అర్జున్ రెండు సినిమాలు మాత్రం బాగా బాధపెట్టాయట. అందులో బద్రినాథ్ ఒక‌టి కాగా.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మ‌రొక‌టి.

బద్రీనాథ్ చిత్రాన్ని వి.వి. వినాయ‌క్ డైరెక్ట్‌ చేశాడు. ఇందులో అల్లు అర్జున్, తమన్నా జంటగా నటించారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఎన్నో అంచనాలు నడుమ 2011 జూన్ 10 విడుదలైన బద్రీనాథ్ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. నిజానికి ఈ మూవీపై అల్లు అర్జున్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని బలంగా నమ్మడు. కానీ అల్లు అర్జున్ నమ్మకాలను బద్రీనాథ్ చిత్రం ఒమ్ము చేసింది.(Allu Arjun)

Also Read: Game Changer: గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ డీల్ క్లోజ్‌.. క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన డిజిట‌ల్ రైట్స్‌!

ఇక నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా విషయానికి వస్తే.. వక్కంతం వంశీ దర్శకత్వంలో వ‌చ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా న‌టిస్తే.. అర్జున్ స‌ర్జా కీల‌క పాత్ర‌ను పోషించాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కోసం అల్లు అర్జున్ త‌న మేకోవ‌ర్ ను పూర్తిగా మార్చుకున్నాడు. సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని భావించారు. కానీ 2018లో రిలీజ్ అయిన ఈ చిత్రం డిజాస్ట‌ర్ అయింది. ఈ ప‌రాజ‌యం అల్లు అర్జున్ ను బాగా బాధ‌పెట్టింది. దాంతో రెండుళ్లు వెండితెర‌పై క‌నిపించ‌ని ఆయ‌న మ‌ళ్లీ 2020లో అల వైకుంఠపురములో మూవీతో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టి స‌క్సెస్ ట్రాక్ ఎక్కారు.

Join WhatsApp