This is the secret behind Sri Leela Dance

Sri Leela: ఎంతోమంది స్టార్ హీరోయిన్లు మన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ కొందరు మాత్రమే మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. వారిలో ఒకరే శ్రీ లీలా కూడా. ఈ ముద్దుగుమ్మ అందం అభినయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. తన మాట తీరు దగ్గర నుంచి యాక్టింగ్ వరకు ప్రతిదీ పర్ఫెక్ట్ గా చేస్తుంది శ్రీ లీల.

This is the secret behind Sri Leela Dance

ఇక ఈ ముద్దుగుమ్మ డాన్స్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పొచ్చు. స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇచ్చే డాన్స్ ని కలిగి ఉంది. ఇక ఈ ముద్దుగుమ్మ డాన్స్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అని విషయాలపై అనేకమంది అరా తీయడం మొదలుపెట్టారు.

Also Read: Prabhas: ప్రభాస్ జాన్ జిగ్రీ దోస్త్ ఆ స్టార్ హీరోనా.. బయటపెట్టిన శ్యామలాదేవి..!

వారికి తెలిసింది ఏంటంటే.. శ్రీలీల అంత బాగా డాన్స్ చేస్తుందంటే దానికి కారణం ఆమె చిన్నప్పటి నుంచే భరతనాట్యంలో ఆరితేరింది. ఇక చిన్నప్పుడే ఈ ముద్దుగుమ్మ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి సత్కారం కూడా చేశారు. క్లాసికల్ డాన్సర్స్ కి ఎటువంటి స్టెప్స్ అయినా వెన్నతో పెట్టిన విద్య. ఎంత కాంప్లికేటెడ్ డాన్స్ అయినా ఇట్టే పట్టేస్తూ డాన్స్ స్టెప్స్ ని వేసేస్తూ ఉంటారు క్లాసికల్ డాన్సర్స్. ఇక శ్రీ లీల విషయంలో కూడా ఇదే జరిగింది.

This is the secret behind Sri Leela Dance

తనకి చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్ రావడంతో ఆమె డాన్స్ లో ఆరితేరింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తన డాన్స్ తో ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. టాలీవుడ్ హీరోయిన్స్ లో మోస్ట్ పాపులర్ డాన్సర్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్లు డాన్స్ చేసినప్పటికీ ఈమె లాగా మరే హీరోయిన్ చేయలేదు. డాన్స్ స్టెప్ ని ఇట్టే పట్టేస్తూ స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తుంది.(Sri Leela)

Join WhatsApp