this little girl in the movie Arundhati

Arundhati: టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన అనుష్క శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించింది. వాటిలో అరుంధతి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ప్రముఖ లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక ఈ మూవీ 2019లో విడుదల భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఈ సినిమానే అనుష్క కెరీర్ కు మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో సోనూ సూద్ అర్జున్ బజ్వా, షాయాజీ కీలక పాత్రలు పోషించారు.

this little girl in the movie Arundhati

ఇక ముఖ్యంగా ఇందులో పశుపతిగా సోను మరియు జేజమ్మగా అనుష్క పాత్రలు మెయిన్ హైలెట్ గా నిలిచాయి. ఇందులో అనుష్క నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఏక అరుంధతి సినిమాకు డైరెక్టర్ కోడి అందించిన మ్యూజిక్ మరింత హైలెట్గా నిలిచింది. ఇప్పటికి కూడా ఈ మూవీ బుల్లితెరపై వస్తుంటే కంటి రెప్ప వెయ్యకుండా ప్రేక్షకులు వీక్షిస్తారు. అంతలాగా హిట్ అయింది మరి ఈ సినిమా. అయితే అరుంధతి సినిమాలో అనుష్క చిన్ననాటి పాత్రలో కనిపించిన ఆ చిన్నారి గుర్తుందా. ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

Also Read: Poonam kaur: బాలకృష్ణ చిన్నల్లుడు పై పూనమ్ కామెంట్స్.. ట్వీట్ వైరల్..!

అనుష్క నటించిన బ్లాక్ బస్టర్ లేరుడి ఓరియంటెడ్ సినిమా అరుంధతి. అప్పట్లో ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. కాగా ఆ సినిమాలో అనుష్క చిన్ననాటి పాత్రలో కనిపించిన చిన్నారి జేజమ్మ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆ సినిమాలో ఆ చిన్నారి నటనకు మంచి ప్రశంసలు కూడా దక్కాయి. కాగా ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు దివ్య గణేష్. ఆమె తెలుగు మరియు తమిళ్ భాషల్లో పలు చిత్రాల్లో బాలనాటిగా అలరించింది. అయితే ఎన్ని సినిమాల్లో నటించిన అరుంధతి సినిమా తోనే దివ్య కు మంచి గుర్తింపు వచ్చింది. కాగా ఈ సినిమా ఆమె కెరీర్ లోనే మర్చిపోలేని సినిమాగా నిలిచిపోయింది.

this little girl in the movie Arundhati

ఈ క్రమంలోనే దివ్య పలు సినిమాలు మరియు కమర్షియల్ యాడ్స్ లో కనిపించింది. కానీ కొన్నాళ్లుగా ఆమె ఏ సినిమాలో కూడా కనిపించడం లేదు. కానీ తాజాగా దివ్య గణేష్ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నారి జేజమ్మ ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ ని తలదాన్ని అందంతో గ్లామర్ ని పెంచేసింది. అంతేకాకుండా త్వరలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు ఈ అమ్మడు ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మలయాళం మరియు తమిళంలో ఈ బ్యూటీ పలు సినిమాలు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.(Arundhati)

Join WhatsApp