Tillu square movie hero Sidhu's sensational comments

Tillu square: సిద్ధూ జొన్నలగడ్డ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోలలో సిద్దు కూడా ఒకరు. డిజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు సిద్దు.

Tillu square movie hero Sidhu’s sensational comments

ఈ సినిమాలో ఈయన పండించిన హాస్యం మరియు కాన్సెప్ట్ కి ప్రతి ఒక్కరు ఫిదా అని చెప్పొచ్చు. ఒకప్పుడు సిద్దు అంటే ఎవరు కూడా పెద్దగా ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు ఈయన డైలాగ్స్ ని యూస్ చేస్తున్నారు. అంత పాపులర్ అయ్యాడు మరి సిద్దు. ఇక తాజాగా టిల్లు స్క్వేర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకి వచ్చేందుకు రెడీ అయ్యాడు.

Also Read: Shakeela: తాను పెళ్లి చేసుకోక పోవడానికి వెనుక ఉన్న కారణాన్ని బయటపెట్టిన షకీలా.. నన్ను వదిలేసి వెళ్లిపోయారు అంటూ ఎమోషనల్..!

అనుపమ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పై సిద్దు అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన లుక్స్ మరియు టీజర్, సాంగ్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారని చెప్పొచ్చు. ఎన్నడూ లేని విధంగా అనుపమ సైతం ఈ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించింది. దీంతో ఒకప్పుడు ఈమెని పొగిడిన వారు అంతా ఇప్పుడు తిడుతున్నారు.

Tillu square movie hero Sidhu's sensational comments

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సాంగ్ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ని ఓ స్టార్ డైరెక్టర్ ఖరారు చేసినట్లు వెల్లడించాడు. సిద్దు మాట్లాడుతూ..” మేము మొదట టిల్లు టు అందామా టిల్లు అందామా అని చాలా ఆలోచించాము. కానీ ఈ అన్ని రొటీన్ గా ఉన్నాయి అనిపించాయి. ఇక అక్కడే ఉన్న త్రివిక్రమ్ గారు ఒక్కసారిగా టిల్లు స్క్వేర్ అందాం అయ్యా అని అన్నారు. దీంతో అందరికీ ఆ టైటిల్ నచ్చడంతో ఆ టైటిల్ తోనే మా సినిమాని రూపొందించాము ” అంటూ చెప్పుకొచ్చాడు సిద్దు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Tillu square)

Join WhatsApp