Tollywood Movies Have the Highest Collections for Sankranti

Tollywood Movies: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీస్ కి పండగలు వచ్చాయంటే చాలు ఏదో ఒక సినిమాను రిలీజ్ చేస్తూ కోట్లు కొల్లగొడుతూ ఉంటారు. చాలామంది పండగల పూట సినిమాలు చూడడానికి కూడా ఇష్టపడతారు. అయితే దసరా, సంక్రాంతి,దీపావళి ఇలా ప్రతి ఒక్క పండగకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అయితే ఈసారి సంక్రాంతికి వెంకటేష్,నాగార్జున,మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో పోటీగా ఇండస్ట్రీలో ఇప్పుడే హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంటున్న చిన్న హీరో తేజా సజ్జా హను మాన్ మూవీ కూడా రిలీజ్ చేశారు. ఇక స్టార్ హీరోల సినిమాలకు పోటీగా రావడంతో చాలామంది ఈ సినిమా అట్టర్ ప్లాఫ్ అవుతుందని భావించారు. కానీ స్టార్ హీరోల సినిమాలు పక్కనపెట్టి హనుమాన్ సినిమాను చూడడానికే జనాలు థియేటర్లకు పోటెత్తారు.

Tollywood Movies Have the Highest Collections for Sankranti

దాంతో ఈసారి సంక్రాంతి బరిలో హీరోగా హనుమాన్ మూవీ నిలిచింది. ఇక టాలీవుడ్ లో సంక్రాంతికి వచ్చి హైయ్యెస్ట్ కలెక్షన్లు సంపాదించిన సినిమాలు. ఏంటో మనం ఒకసారి చూద్దాం.. హను మాన్ చిత్రం 2024 సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ఇప్పటికే 265 కోట్లు కొల్లగొట్టింది. అంతే కాదు ఈ సినిమా ఇంకా థియేటర్ల లో రన్ అవుతుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురం సినిమా జనవరి 12, 2020లోసంక్రాంతికి వచ్చింది. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ నటన, పూజ హెగ్డే అందాలు, ఎమోషనల్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.అలా 2020 లో సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 260 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో వచ్చి హైయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా అలవైకుంఠపురం సినిమా ఉండేది. కానీ ఈసారి అలవైకుంఠపురం సినిమా రికార్డుని చెరిపివేసి హనుమాన్ చిత్రం హైయ్యెస్ట్ కలెక్షన్లు వసూలు చేసింది. (Tollywood Movies)

Also Read: Amy Jackson: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న అమీ జాక్స‌న్‌.. సినిమా స్టైల్ లో ప్రియుడితో ఎంగేజ్మెంట్‌!

చిరంజీవి, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా రవితేజ ముఖ్య పాత్రలో బాబి దర్శకత్వం వహించిన వాల్తేరు వీరయ్య మూవీ 2023, జనవరి 12 సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదైన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 230 కోట్లు కలెక్ట్ చేసింది.మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ 2020 జనవరి 10న సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 220 కోట్లను కొల్లగొట్టింది.త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా ఈసారి అనగా 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ప్లాఫ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్లు సాధించింది.


Telugu movies have the highest collections for Sankranti

సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 176 కోట్లు వసూలు చేసింది.మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నెంబర్ 150.ఈ సినిమా కి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు.ఇక 2017 సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఖైదీ నెంబర్ 150 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్ట్ చేసింది.ఇక చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన సినిమా కావడంతో ఈయన అభిమానులు వారి అభిమాన హీరోని థియేటర్లో చూడడానికి పోటెత్తారు. అలా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 165 కోట్లు కలెక్ట్ చేసింది.అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్2. ఈ సినిమాలో తమన్నా,మెహరీన్ హీరోయిన్స్ గా చేశారు. 2019 జనవరి 12 సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 మూవీ బాక్సాఫీస్ వద్ద 130 కోట్లు వసూలు చేసింది. బాలకృష్ణ, హనీ రోజ్,శృతిహాసన్ కాంబినేషన్లో వచ్చిన వీర సింహారెడ్డి సినిమాకి గోపీచంద్ మలలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2023జనవరి 12న సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద 127 కోట్లు వసూలు చేసింది. (Tollywood Movies)

Join WhatsApp