Tollywood: Nitin, Nani, Chaithu get the hit movies crazy hero

Tollywood: హ్యాపీ డేస్ చిత్రం ద్వారా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుని మంచి ఫామ్ లోకి వచ్చిన హీరో వరుణ్ సందేశ్. టాలీవుడ్ లో యంగ్ ప్రామిసింగ్ హీరోగా ఈయన కనిపించాడు. అందుకు తగ్గట్లుగానే వరుణ్ వరస సూపర్హిట్లు కొట్టాడు. కొత్త బంగారులోకం చిత్రం యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా విజయం సాధించింది.

Tollywood: Nitin, Nani, Chaithu get the hit movies crazy hero

కుర్రాడు లాంటి చిత్రాలు కూడా బాగానే కలెక్షన్స్ రాబట్టాయి. టాలీవుడ్ లో క్రేజీ హీరోగా వరుణ్ సందేశ్ ఎదిగేందుకు ప్లాట్ఫారం సెట్ అయ్యింది. కానీ అదే సమయంలో వరుణ్ సందేశ్ తప్పట‌ అడుగులు వేశాడు. దీనికి తోడు వరుణ్ కి అదృష్టం కూడా కలిసి రాలేదు. నాగచైతన్య సూపర్ హిట్ చిత్రం 100% లవ్ మూవీ ముందుగా వరుణ్ సందేశ్ తో అనుకున్నారట.

Also Read: Varun Sandesh: వరుణ్ సందేశ్ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఆయనేనా..?

ఇక వరుణ్ హీరోగా కంఫర్మ్ అయ్యాడు కూడా. కానీ ఊహించని విధంగా నాగచైతన్య చేతుల్లోకి ఈ మూవీ వెళ్ళిపోయింది. తనని ఎందుకు పక్కన పెట్టారో కూడా అర్థం కాలేదట. ఇక వరుణ్ సందేశ్ నటించాల్సిన మరో చిత్రం గుండె జారి గల్లంతయ్యిందే. ఈ చిత్రం కోసం దర్శకుడు ముందుగా ని అనుకున్నాడట. కానీ చూస్తే నితిన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.

Tollywood: Nitin, Nani, Chaithu get the hit movies crazy hero

నాని నటించిన భిమిలి కబడ్డీ మూవీ కూడా వరుణ్ సందేశ్ తో తెరకెక్కించాలని భావించాడట డైరెక్టర్. ఈ మూవీ సూపర్ హిట్ చెప్పలేం కానీ విమర్శకుల ప్రశంసలను అయితే అందుకుంది. ఇక ఈ మూవీ నుంచి కూడా వరుణ్ తేజ్ తప్పుకోవాల్సి వచ్చింది. అలా నాని, నితిన్, చైతన్య ఈ బ్లాక్ బస్టర్ సినిమాలు వరుణ్ సందేశ్ కి దక్కాలి. కానీ ఆయన అదృష్టం బాగోక పోవడంతో కలిసి రాలేదు.(Tollywood)

Join WhatsApp