Tollywood: remember this cutie who acted in Ma Uri Polimera?

Tollywood: ఓటిటి లు వచ్చిన అనంతరం నుంచి సిరి ప్రియులకు లెక్కలేనంత వినోదం వస్తుంది. కొత్త కొత్త సినిమాలు తో పాటు అద్భుతమైన వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. చూసిన వాళ్లకు చూసినంతలా.. కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్, హర్రర్ సినిమాలకు ఆదరణ బాగా వస్తుంది. ఆ మధ్య హాట్ స్టార్ లో వచ్చిన మా ఊరి పోలిమేర మూవీ.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని అందించింది.

Tollywood: remember this cutie who acted in Ma Uri Polimera?

బ్లాక్ మ్యాజిక్ చుట్టూ కథ సాగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రలో పోషించారు. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్ పై భోగేంద్రగుప్త నిర్మించిన ఈ మూవీ కి డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈ ఊరి పొలిమేర ఓటిటిలో విడుదలైన అనంతరం హిట్ అవడంతో సెకండ్ పార్ట్ ను థియేటర్లలో విడుదల చేశారు. మా ఊరి పోలిమేర 2 సైతం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇందులో ఉండే ట్విస్ట్ లకు ప్రేక్షకులు బాగా అట్రాక్ట్ అయ్యారు.

Also Read: Sobhan Babu: శోభన్ బాబు ఆస్తులన్నీ కొడుకులు అమ్మేశారా.. సంచలన విషయం బయటపెట్టిన సీనియర్ హీరో..!

ఇక ఈ మూవీలో రాజేష్ భార్యగా నటించిన కామాక్షి కి ఎంత పేరొచ్చిందో.. గెటప్ శ్రీను భార్యగా నటించిన సాహితీ కి కూడా అంతే పేరు వచ్చింది. మా ఊరి పోలిమేర మూవీలో ఆమె రాములు పాత్రలో ఒదిగిపోయింది. గెటప్ శ్రీను భార్యగా.. రాజేష్ పై మనసు పడ్డ మరదలిగా అద్భుతంగా యాక్ట్ చేసింది. రాములు ఫ్లాష్ బ్యాక్ తెలియక.. కథ పై మరింత ఆసక్తి పెరుగుతుంది. ట్విస్టులు ఆకట్టుకుంటాయి. మొదట సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్స్ గా క్రేజ్ తెచ్చుకున్న సాహితీ కి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చేందుకు అవకాశాలు వచ్చాయి.

Tollywood: remember this cutie who acted in Ma Uri Polimera?

మా ఊరి కొలిమిర సినిమా తర్వాత.. ఈమెకి అవకాశాలు పెరిగాయి. సింగర్ సునీత కుమారుడు హీరోగా నటించిన ” సర్కారు నౌకరి ” మూవీలోనూ సాహితీ నటించింది. ఇక ఇప్పుడు కంచు కనక మహాలక్ష్మి అనే మూవీలో నటిస్తుంది. మా ఊరి పొలిమేర మూవీ లో పల్లెటూరి మహిళగా కనిపించిన ఈమె నిజంగా మాత్రం చాలా అందంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అందచందాలను ఆరబోస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.(Tollywood)

Join WhatsApp