Tollywood Star singer interesting comments

Tollywood: టాలీవుడ్ స్టార్స్ సింగర్ కౌశల్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె 1999లో నీకోసం సినిమాతో సింగర్ గా పరిచయమైంది. ఆ తరువాత తెలుగులో యంగ్ హీరో లా హిట్ చిత్రాల్లో పాటలు పాడి స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అదేవిధంగా హీరోయిన్ కల్యాణి కి కొన్ని సినిమాల్లో డబ్బింగ్ చెప్పి తన గొంతుతో ఎంతోమందిని ఆకట్టుకుంది.

Tollywood Star singer interesting comments

సింగర్ గా, నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేసి తన టాలెంట్ తో కెరీర్ మరింత ముందుకు సాగించింది ఈ ముద్దుగుమ్మ. అయితే కౌసల్య పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈమెకి ఓ కొడుకు పుట్టాక భర్తతో విడాకులు తీసుకుంది. కానీ అందుకు గల కారణాలు మాత్రం చెప్పలేదు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌసల్యా విడాకులు తీసుకోవడానికి కారణాలు చెప్పుకొచ్చింది. ఈమె మాట్లాడుతూ..” నా భర్త ఇంట్లో నాకు స్వేచ్ఛ ఉండేది కాదు. అతనితో పాటు ఆయన ఫ్యామిలీ వారు కూడా నన్ను చిత్రహింసకు గురి చేసేవారు.

Also Read: Rajamouli: కీరవాణి కొడుకులు జక్కన్నను ఏమని పిలుస్తారో తెలుసా..!

అంతేకాకుండా నా భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలియడంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యాను. నా కొడుకు బాధ్యత తీసుకుని పెంచి పెద్ద చేశాను. ప్రస్తుతం మా అబ్బాయి నన్ను ఒంటరిగా ఉండకుండా తోడుగా ఉండేందుకు రెండో పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు ” అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tollywood Star singer interesting comments

ఇక నేటి కాలంలో ఒకరితో విడిపోవడం అనంతరం రెండో పెళ్లి చేసుకోవడం చాలా కామన్ గా మారిపోయాయి. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఇప్పటికే రెండో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన సమాచానికే భర్తకి విడాకులు ఇచ్చేసి అనంతరం మరో దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతూ ఉంటున్నారు. ఇక కొందరు అయితే రెండో పెళ్లి బంధం లో కూడా శాశ్వతంగా నిలవలేక పోతున్నారు. ఇక ఈ సింగర్ తన కొడుకు మాటలు విని రెండో పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి మరి.(Tollywood)

Join WhatsApp