Trisha was hospitalized because of that movie

Trisha: తెలుగు తెరపై 40 ఏళ్ల అయినా చెక్కుచెదరని అందంతో వయసు పెరుగుతున్నా కొద్దీ మరింత అందం తో మెరిసిపోతున్న త్రిష రీసెంట్ గానే 41 ఏళ్ల పుట్టిన రోజుని గ్రాండ్ గా జరుపుకుంది. ఇన్నేళ్లయినా పెళ్లి చేసుకోలేదు కానీ సినిమాల్లో మాత్రం తగ్గేదెలే అన్నట్లు వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చేసింది.కానీ ఒక సినిమా కారణంగా హాస్పిటల్ పాలై చాలా రోజులు హాస్పిటల్ లో చికిత్స తీసుకుందట.

Trisha was hospitalized because of that movie

మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి..ఎందుకు హాస్పిటల్ పాలవ్వాల్సి వచ్చింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. చెన్నై బ్యూటీ త్రిషకి ఇండస్ట్రీలో క్రేజ్ వచ్చింది వర్షం మూవీతో. ఈ సినిమా కంటే ముందే తమిళంలో ఓ సినిమా చేసింది.కానీ అంత గుర్తింపైతే రాలేదు. ఇక నీ మనసు నాకు తెలుసు అనే మూవీ తో కూడా త్రిష మెప్పించలేదు. కానీ వర్షం మూవీ మాత్రం త్రిషకి ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా కారణంగా త్రిష టాలీవుడ్ లో ఒక్కసారిగా టాలీవుడ్ హీరోయిన్లలో టాప్ పొజిషన్లోకి వెళ్ళింది. (Trisha)

Also Read: Ramya Krishna: స్టార్ హీరోయిన్ అవ్వాలంటే వారి పడక గదుల్లోకి వెళ్లాల్సిందే.. రమ్యకృష్ణ సంచలన కామెంట్స్..!

అయితే అలాంటి ఎంతో పేరు తెచ్చిన ఈ వర్షం మూవీ త్రిషని హాస్పిటల్ పాలు కూడా చేసిందట.అయితే ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టే హీరోయిన్ ఎక్కువగా వర్షం లో తడిసే సన్నివేశాలు ఉంటాయి. అలా ఈ వర్షం లో తడిసే సన్నివేశాలు షూట్ చేయడం కోసం దాదాపు 20 రోజుల సమయం పట్టిందట. ఇక 20 రోజుల పాటు త్రిష వర్షంలో తడవడం కారణంగా ఆమెకు జలుబుతో కూడిన జ్వరం వచ్చి చాలా రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుందట.

Trisha was hospitalized because of that movie

అయితే హాస్పిటల్ పాలైన త్రిష తనకి ఆరోగ్యం బాగాలేదు అనే విషయం పక్కనపెట్టి అసలు సినిమా హిట్ అవుతుందా లేదా అని ప్రతిసారి ఆలోచించేదట.ఇక ఆమె అంత కష్టపడినందుకు సినిమా హిట్ రూపంలో భారీ అదృష్టం కలిసి వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో త్రిష స్టార్ అయిపోయింది. ఆ తర్వాత త్రిష ఎన్నో సినిమాలు చేసింది అయితే ఈ సినిమాలో ప్రభాస్ త్రిష జోడి బాగుంది.మూవీ కూడా హిట్ అవ్వడంతో దీనికి రిమేక్ తీద్దామని మూవీ మేకర్స్ అనుకున్నప్పటికీ వర్షంలో తడిసి అనారోగ్యం పాలైన సంఘటన గుర్తు చేసుకొని వామ్మో నేను ఈ సినిమాలో నటించను అని చెప్పేసిందట.(Trisha)

Join WhatsApp