Upasana Feel Jealous On Klin Kaara

Upasana: మెగా కోడ‌లు ఉపాస‌న కొణిదెల‌ను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. రామ్ చ‌ర‌ణ్ వంటి టాప్ స్టార్ కు భార్య‌గానే కాకుండా స‌క్సెస్ ఫుల్ బిజినెస్ వుమెన్‌గానూ ఉపాస‌న గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఒక‌టైన‌ అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ పనులను ఉపాస‌న ద‌గ్గ‌రుండి చూసుకుంటోంది. అపోలో చారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా, బి పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజైన్ కు ఎడిటర్ వ్య‌వ‌హ‌రిస్తోంది.

Upasana Feel Jealous On Klin Kaara

ఇలా అనేక బాధ్య‌త‌ల‌ను స‌క్సెస్ ఫుల్ గా నిర్వ‌ర్తిస్తున్న ఉపాస‌న‌.. 2023లో భార్య నుంచి త‌ల్లిగా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ తో వివాహం జ‌రిగిన 11 ఏళ్ల త‌ర్వాత ఉపాస‌న త‌న మొద‌టి బిడ్డ‌ను ఆహ్వానించింది. గ‌త ఏడాది పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు త‌మ లిటిల్ ప్రిన్సెస్‌కు క్లిన్ కారా అంటూ నామ‌క‌ర‌ణం కూడా చేశారు. అయితే ఇంత వ‌ర‌కు త‌మ చిన్నారి రూపాన్ని మీడియాకు చూపించ‌లేదు.

మెగా ఫ్యాన్స్ మాత్రం క్లిన్ కారా ఎలా ఉంటుందో చూసేందుకు తెగ ఉత్సాహ ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. క్లిన్ కారాకు సంబంధించి ఉపాస‌న తాజాగా ఓ క్యూట్ అండ్ స్వీట్ విష‌యాన్ని పంచుకుంది. ఉపాస‌న తాత‌గారు, అపోలో హాస్పిట‌ల్స్‌ అధినేత డా. ప్రతాప్ చంద్ర రెడ్డి 91వ బ‌ర్త్‌డేను పుర‌స్క‌రించుకుని ది అపోలో స్టోరీ అనే కామిక్ బుక్‌ను లాంచ్ చేసింది. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఉపాస‌న‌.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాలు పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే క్లిన్ కారా మ‌రియు రామ్ చ‌ర‌ణ్‌ల మ‌ధ్య బాండింగ్ గురించి మాట్లాడుతూ ఉపాస‌న త‌న ఈర్ష్య ను వ్య‌క్త ప‌రిచింది.(Upasana)

Also Read: Rashmika Mandanna: యానిమ‌ల్ స‌క్సెస్ తో రెమ్యున‌రేష‌న్ పెంచేసిన ర‌ష్మిక‌.. బాలీవుడ్ లో అలా, టాలీవుడ్ లో ఇలా..!?

తన తండ్రి చరణ్ ను చూడగానే క్లీన్ కార కళ్లు మెరిసి పోతాయి. చ‌ర‌ణ్ క‌నిపించాడంటే చాలు స్పెష‌ల్ స్మైల్ వ‌చ్చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం చూస్తే ఒక్కోసారి నాకే ఎంతో ఈర్ష్యగా ఉంటుంది అంటూ ఉపాస‌న చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, క్లిన్ కారా మెగా ఫ్యామిలీకి ల‌క్కీ చైల్డ్ అని చెప్పుకోవ‌చ్చు. ఆమె ఉపాస‌న క‌డుపులో ప‌డ్డ‌ప్ప‌టి నుంచి మెగా ఫ్యామిలీకి చాలా విష‌యాలు క‌లిసొచ్చాయి. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ రావ‌డం, అల్లు అర్జున్ నేష‌న‌ల్ అవార్డు అందుకోవ‌డం, వ‌రుణ్ తేజ్ పెళ్లి పీట‌లెక్క‌డం, ఇక ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక కావ‌డం.. ఇవ‌న్నీ క్లిక్ కారా వ‌చ్చాకే జ‌రిగాయి. దీంతో ఈ మెగా లిటిల్ ప్రిన్సెస్ అంద‌రికీ ఎంతో స్పెష‌ల్ గా మారింది.

Join WhatsApp