Urvashi Rautela birthday cake cost

Urvashi Rautela: బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా సౌత్ ఇండస్ట్రీ సినీ ప్రియులకు కూడా సుపరిచితమైన హీరోయిన్. ఈమె తెలుగులో చిరంజీవి హీరోగా చేసిన వాల్తేరు వీరయ్య మూవీలో బాసూ వేర్ ఈజ్ ద పార్టీ అనే ఐటెం సాంగ్ లో చిరంజీవి సరసన ఆడిపడింది.అలాగే అక్కినేని అఖిల్ హీరోగా చేసిన ఏజెంట్ మూవీలో వైల్డ్ సాలా అనే ఐటమ్ సాంగ్ లో ఆడిపడింది. అయితే ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా అరుళ్ శరవణన్ హీరోగా చేసిన ది లెజెండ్ అనే మూవీ లో హీరోయిన్ గా చేసింది.

Urvashi Rautela birthday cake cost

మోడల్ అలాగే హీరోయిన్ అయినా ఊర్వశి రౌటేలాకి తెలుగులో అన్ని ఐటెం సాంగ్ పాత్రలే వస్తున్నాయి.కానీ బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కూడా చేసింది. అంతేకాకుండా ఊర్వశి రౌటేలా అందాల పోటీల్లో పాల్గొని 2015లో మిస్ దివా యూనివర్ అలాగే ఇండియా తరపున మిస్ యూనివర్స్ కిరీటం కూడా గెలుచుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఫిబ్రవరి 25న తన 30 వ బర్త్డే చాలా గ్రాండ్ గా జరుపుకుంది. (Urvashi Rautela)

Also Read: Prabhas: ప్రభాస్, ఆశిష్ పెళ్లి రిసెప్షన్ కి హాజరు కాకపోవడానికి కారణం ఇదేనా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

అయితే ఈమె బర్త్డే గురించి అంత స్పెషల్ గా చెప్పుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే చాలా మంది బర్త్డేలకు వెరైటీ వెరైటీ కేకులను కోస్తూ ఉంటారు. అయితే అందరూ తమ బర్త్డేలకు కోసే కేకు ఒకెత్తయితే ఊర్వశి రౌటేలా తన బర్త్డే రోజు కోసిన కేకు ఒకెత్తవుతుంది. ఎందుకంటే ఆమె తన బర్త్ డే సందర్భంగా గోల్డెన్ కలర్ పూత పూసిన 24 క్యారెట్ల బంగారం కేక్ ని కట్ చేసింది.తన స్నేహితుడు అయిన యోయో హనీ సింగ్ తో కలిసి ఆమె తన 30 పుట్టినరోజును జరుపుకుంది.

ఇక బర్త్డే రోజు గోల్డెన్ కేకు కోయడంతో ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాదు ఈ విషయం తెలిసిన నార్మల్ జనాలైతే అన్ని డబ్బులు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు లేదా పేదవారికి సహాయం చేయొచ్చు కదా..ఇలా మీ ఆనందం కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ మండిపడుతున్నారు. ఇక బర్త్డే రోజు ఊర్వశి రౌటేలా కోసిన 24 క్యారెట్ల ఆ బంగారం కేకు ధర ఎంతో కాదు అక్షరాల 3 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన చాలామంది ఆ మూడు కోట్లతో ఓ ఫ్లాట్ కొనొచ్చు అలాంటిది కేకు కు మూడు కోట్లు తగలేయడం ఏంటో అని ఆశ్చర్యపోతున్నారు.(Urvashi Rautela)

Join WhatsApp