Varalakshmi Sarathkumar commented

Varalakshmi Sarathkumar: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ అయితేనే గుర్తింపు రాదు. తమ నటనతో విధ్వంసం పుట్టిస్తే ఏ రోల్ లో ప్లే చేసిన వారికి మంచి గుర్తింపు దక్కుతూ ఉంటుంది. అలా అక్క మరియు చెల్లి, లవర్ వంటి పాత్రలలో పోషిస్తూ స్టార్ హీరోయిన్స్ ని తలదన్నే అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్న ఏకైక ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్ కుమార్ అనే చెప్పుకోవచ్చు. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్యకి చెల్లెలి పాత్ర పోషించి ప్రతి ఒక్కరిని మైమరిపించింది వరలక్ష్మి శరత్ కుమార్.

Varalakshmi Sarathkumar commented

ఇక రీసెంట్ గానే 2024 లో సంక్రాంతి బరిలో విడుదలై భారీ విజయం అందుకున్న హనుమాన్ మూవీలో కూడా తేజ కి అక్క పాత్రలో కనిపించి మెప్పించింది. ఇలా మంచి కథలను ఎంచుకుంటూ వరుస హ్యాట్రిక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్.. తనని బో డైరెక్టర్ రూమ్ కి రమ్మని పిలిచాడని.‌.‌ ఒక స్టార్ హీరో కూతురు అయ్యుండి నాకే అటువంటి సవాలు విసిరితే నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటి? అని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.

Also Read: Vijay Devarakonda: ప్రేమలు బ్యూటీతో విజయ్ దేవరకొండ సరికొత్త ఫిల్మ్..!

ఇక ఇదే ఇంటర్వ్యూలో ఈమె స్టార్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదంటూ కొన్ని కామెంట్స్ చేశారు. మరి ఆ కామెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ..” సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు రెండు లేదా మూడు రీజన్స్ ఉంటాయి. కొంతమంది వచ్చేసరికి స్టార్ అవ్వాలని వస్తూ ఉంటారు. మరి కొంతమంది వచ్చేసరికి నిజంగానే మాకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉందని.. అందుకే వచ్చామని అంటూ ఉంటారు. నేను సెకండ్. నేను ఫస్ట్ లో మూవీస్ లోకి వచ్చేటప్పుడు స్టార్ అవ్వాలి అనుకుని రాలేదు.

Varalakshmi Sarathkumar commented

ప్రతి సినిమాలో డిఫరెంట్ రోల్ ప్లే చేయాలి అనే ఇష్టంతో వచ్చాను. ప్రతి సినిమాలో నా క్యారెక్టర్ లో నేను లేకుండా ఓ మంచి వ్యక్తిని చూపించాలి. ప్రతి సినిమాలో నేను ఉండాలి. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో కూడా వరలక్ష్మి కనిపించదు. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. వాటి ద్వారా నేను ఇన్స్పైర్ అవుతా. ఆడియన్స్ కి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కోలాగా కనిపించాలనేది నా ఆలోచన. అందువల్ల నేను స్టార్ అవ్వాలని రాలేదు. నాకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇండస్ట్రీకి వచ్చా ” అంటూ తెలియజేసింది వరలక్ష్మి శరత్ కుమార్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.(Varalakshmi Sarathkumar)

Join WhatsApp