Varalakshmi sarathkumar interesting comments

Varalakshmi sarathkumar: టాలీవుడ్ యంగ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సీనియర్ హీరో, నటుడు శరత్ కుమార్ వారసురాలిగాసిని రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. కానీ గత కొంతకాలంగా మాత్రం అదిరిపోయే పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవల హనుమాన్ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంగా రాబోతున్న ఓ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించింది. ముఖ్యంగా ఈ పాత్రలో ఓ బిడ్డకు తల్లిగా, సింగిల్ పేరెంట్ గా సెన్సాక్షన్ క్రియేట్ చేయబోతుంది.

Varalakshmi sarathkumar interesting comments

ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ క్యూట్ బ్యూటీ. ఓ స్టార్ కూతురు అయిన తననే.. ఓ టీవీ యాడ్ తన ఇంటికే వచ్చి రూమ్ కు రమ్మని పిలిచినట్లు చెప్పుకొచ్చింది. మరి వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2011లో తమిళ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. ఈ సినిమా అనంతరం అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

Also Read: Rajamouli: కీరవాణి కొడుకులు జక్కన్నను ఏమని పిలుస్తారో తెలుసా..!

ఇక బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాలలో నటించి ప్రస్తుతం దూసుకుపోతుంది వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు తో పాటు తమిళ్ మరియు మలయాళం, కన్నడ భాషల్లోనూ తన క్రేజ్ ని చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం 38 ఏళ్ల వయసు కలిగిన ఈ బ్యూటీ ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చింది. అలా పర్సనల్ లైఫ్ లో ముందుకు వెళ్లేందుకు ముందు అడుగు వేసింది వరలక్ష్మి. ఇక తాజాగా ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాపింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. కెరీర్ స్టార్టింగ్ లో తాను కూడా చాలా సమస్యలు ఎదుర్కున్నట్లు తెలిపింది.

Varalakshmi sarathkumar interesting comments

ముఖ్యంగా స్టార్ కూతురును అయినా తనను.. ఓ టీవీ డైరెక్టర్ రూమ్ కి రమ్మని పిలిచినట్లు చెప్పుకొచ్చింది. నేరుగా తన ఇంటికే వచ్చి మళ్లీ కలుద్దామని.. ఎందుకు అని అడిగితే రూమ్ బుక్ చేస్తాను.. పర్సనల్ గా మాట్లాడుకుంటామంటూ చెప్పినట్లు వెల్లడించింది వరలక్ష్మి. స్టార్ కూతురు పరిస్థితి ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదని వివరించింది. అందుకే తాను శక్తి ప్రొడక్షన్ ప్రారంభించి.‌.. కష్టాల్లో ఉన్న ఆడపిల్లలకు సాయం చేస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం వరలక్ష్మి కామెంట్స్ చూసిన పలువురు శభాష్ అంటున్నారు.(Varalakshmi sarathkumar)

Join WhatsApp