Varalakshmi Sharath Kumar Viral comments

Varalakshmi: సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ముఖ్యపాత్రల్లో నటిస్తుంది. అంతేకాదు తెలుగులో ఈమె విలన్ గా చేసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో టాలీవుడ్ కి లేడి విలన్ దొరికేసింది అని ఎంతో మంది దర్శకులు సంబర పడిపోయారు.ఇదిలా ఉంటే రీసెంట్ గానే ఈమె పెళ్లి చేసుకోబోతున్నాను అని ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా షేర్ చేసింది.

Varalakshmi Sharath Kumar Viral comments

అయితే చాలామంది సెలబ్రిటీ కూతుర్లకి ఎలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఉండదని అనుకుంటూ ఉంటారు.కానీ ఈ విషయంలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లు వస్తే ఎలా ఇబ్బంది పడతారో నేను కూడా అలాగే ఇబ్బంది పడ్డాను. స్టార్ హీరో కూతురైన నాకు కూడా క్యాస్టింగ్ కౌచ్ తప్పలేదు.ఓసారి మా ఇంటికి ఒక ఛానల్ కి సంబంధించిన హెడ్ వచ్చారు. అయితే ఆయన తన పని పూర్తయ్యాక మీ మూడ్ బాగా లేనట్లుంది. (Varalakshmi)

Also Read: Rana: సమంత పెద్ద సోది మొహం.. ఆమెతో రెండుమూడు గంటలు ఆ పని చేయొచ్చు..!

రూమ్ బుక్ చేస్తాను అక్కడికి వస్తారా అని అడిగారు.దాంతో నేను వాట్ ఏం మాట్లాడుతున్నారు అని కోపంగా అరిచేసరికి ఏం లేదు మీ మూడ్ కాస్త డిస్టర్బ్ గా ఉంది కాబట్టి రూమ్ బుక్ చేస్తాను అక్కడికి వస్తే ఎంజాయ్ చేద్దాం అని చెప్పడు.. దాంతో చిర్రెత్తుకొచ్చిన నేను ఏం మాట్లాడుతున్నావ్ రా మా ఇంటికి వచ్చి నన్నే రూమ్ కి రమ్మంటావా..స్టార్ హీరో కూతుర్ని అని కూడా చూడకుండా అంత మాట అంటావా అంటూ తిట్టేసి ఇంటి నుండి పంపించాను.

Varalakshmi Sharath Kumar Viral comments

అంతేకాదు అతని మీద కేసు కూడా పెట్టి జాబ్ పోయేలా చేశాను. అలాగే కొన్ని సినిమాల్లో నాకు హీరోయిన్ అవకాశం వచ్చినప్పటికీ చాలామంది ఆమె అలాంటిది కాదు అలాంటి పనికి ఒప్పుకోదు. అలాంటి అమ్మాయి మన సినిమాలో వద్దు అని ఎంతోమంది నా ముందే మాట్లాడుకొని నన్ను కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్ర నుండి తప్పించారు అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ తనకు జరిగిన చేదు అనుభవాలను బయటపెట్టింది.(Varalakshmi)

Join WhatsApp