Varalaxmi Sarathkumar Give Green Signal To Her Marriage

Varalaxmi Sarathkumar: సీనియ‌ర్ స్టార్ శ‌ర‌త్‌కుమార్ కూతురిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌.. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. ఎంతో టాలెంట్ ఉన్నా కూడా ప‌ర్స‌నాలిటీ కార‌ణంగా ఆమె హీరోయిన్ గా స‌క్సెస్ కాలేక‌పోయింది. ఈ క్ర‌మంలోనే విల‌న్ గా, స‌హాయ‌క న‌టిగా ట‌ర్న్ తీసుకుంది. విభిన్న‌మైన పాత్ర‌ల‌తో అతి త‌క్కువ స‌మ‌యంలోనే విల‌క్ష‌ణ న‌టిగా పేరు తెచ్చుకుంది. కేవ‌లం త‌మిళంలోనే కాకుండా తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టిస్తూ భారీ స్టార్డ‌మ్ ను సంపాదించుకుంది.

Varalaxmi Sarathkumar Give Green Signal To Her Marriage

ఇటీవ‌లె హ‌నుమాన్ మూవీలో అంజ‌మ్మ‌గా వ‌ర‌ల‌క్ష్మి అంద‌రినీ ప‌ల‌క‌రించింది. ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎలాంటి విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం విల‌న్‌గా, స‌హాయ‌క న‌టిగానే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తోంది. ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. 38 ఏళ్లు వ‌చ్చినా వ‌ర‌ల‌క్ష్మి ఇంకా సింగిల్ లైఫ్‌నే లీడ్ చేస్తోంది.

గ‌తంలో హీరో విశాల్ తో వ‌ర‌ల‌క్ష్మి ల‌వ్ లో ఉంద‌ని.. ఇద్ద‌రూ పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో కూడా ఉన్నార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. కానీ, పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే వారు బ్రేక‌ప్ చెప్పుకున్నారు. ఆ త‌ర్వాత వ‌ర‌ల‌క్ష్మి పెళ్లిపై అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఇటీవ‌ల కాలంలో పెళ్లి గురించి ఎప్పుడు ప్ర‌శ్నించినా వ‌ర‌ల‌క్ష్మి క‌స్సుబుస్సులాడుతూ స‌మాధానం ఇస్తోంది. లైఫ్‌లో పెళ్లి అనేది ఒక పార్ట్ మాత్ర‌మే అని.. అదేమి గోల్ కాదంటూ చెబుతోంది.(Varalaxmi Sarathkumar)

Also Read: Tollywood Heroes: థియేట్రిక‌ల్‌ బిజినెస్ ప‌రంగా టాప్-10 లో ఉన్న టాలీవుడ్ హీరోలు వీళ్లే.. మొద‌టి స్థానం ఎవ‌రిదంటే?

ఇలాంటి త‌రుణంలో వ‌ర‌ల‌క్ష్మి పెళ్లిపై ఓ క్రేజీ న్యూస్ కోలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇంట్లో వాళ్లు ఒత్త‌డి పెడుతుండ‌టంతో ఎట్ట‌కేల‌కు వ‌ర‌ల‌క్ష్మి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. అది కూడా ఒక త‌మిళ స్టార్ హీరోతో ఆమె ఏడ‌డుగులు వేయ‌బోతోంద‌ని కోలీవుడ్ మీడియా కోడై కోస్తోంది. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు శింబు. గ‌తంలో న‌య‌న‌తార‌, హ‌న్సిక వంటి హీరోయిన్ల‌తో ల‌వ్ ఎఫైర్లు న‌డిపిన శింబు.. స్టిల్ బ్యాచిల‌ర్‌గానే ఉన్నాడు. అయితే శింబు, వ‌ర‌ల‌క్ష్మి మ‌ధ్య ఎప్ప‌టినుంచో మంచి స‌న్నిహిత్యం ఉంది. శింబు హీరోగా తెర‌కెక్కిన పోడా పోడి సినిమాతోనే వ‌ర‌ల‌క్ష్మి హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రూ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఇప్పుడు శింబు-వ‌ర‌ల‌క్ష్మి త‌మ ఫ్రెండ్‌షిప్‌ను రిలేష‌న్‌షిప్‌గా మార్చ‌బోతున్నార‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఇరువురి స‌న్నిహితులు మాత్రం అవి కేవ‌లం రూమర్సే అంటున్నారు.

Join WhatsApp