Varalaxmi Sarathkumar Interesting Comments On Her Personal Life

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్.. సౌత్ సినీ ప్రియులకు ఈ విలక్షణ నటిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ.. లేడీ విలన్ గా వరలక్ష్మి భారీ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రతినాయిక‌ పాత్రలే కాకుండా బలమైన సహాయక పాత్రల‌ను పోషిస్తూ కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది. అలాగే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ అలరిస్తోంది.

Varalaxmi Sarathkumar Interesting Comments On Her Personal Life

ఇకపోతే 38 ఏళ్ల వరలక్ష్మి త్వ‌ర‌లో పెళ్లి పీటలేకపోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి గురించి మీడియా ప్ర‌శ్నించిన‌ ప్రతిసారి నాట్ ఇంట్రెస్టెడ్ అంటూ సమాధానం ఇచ్చిన వరలక్ష్మి.. అనూహ్యంగా మార్చి 1న ముంబై కి చెందిన వ్యాపారవేత్త మ‌రియు గ్యాలరిస్టు నికోలాయ్ సచ్ దేవ్ ను నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. దాదాపు 14 ఏళ్ల నుంచి నికోలాయ్ సచ్‍దేవ్‍, వరలక్ష్మి మ‌ధ్య ప‌రిచ‌యం ఉంది.

ఈ ప‌రిచ‌యంతోనే ఇప్పుడీ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి.. తన ప్రొఫెషన్ మరియు పర్సన‌ల్ లైఫ్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. నటన జీవితం మరియు వ్యక్తిగత జీవితం తాను ప్లాన్ చేసుకున్నట్టుగా ఏమాత్రం జరగలేదని వరలక్ష్మి ఈ సంద‌ర్భంగా తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. పోడా పోడీ సినిమా చేస్తున్న సమయంలో నా వయసు 22 ఏళ్ళు. 28 ఏళ్ల లోపు స్టార్ నాటిగా ఎదగాలని భావించాను.(Varalaxmi Sarathkumar)

Also Read: Sridevi Vijaykumar: పెళ్లి త‌ర్వాత కెరీర్ నాశ‌నం.. అందుకే సినిమాలు మానేశానంటూ నిజాలు బ‌య‌ట‌పెట్టిన శ్రీ‌దేవి!

అలాగే 32 ఏళ్లకు పెళ్లి చేసుకుని.. 34 ఏళ్ల‌కు పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకున్నాను. కానీ అలా ఏమీ జరగలేదు. పోడాపోడీ సినిమా తర్వాత పర్సనల్ లైఫ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాను. నేను చేసిన పెద్ద తప్పు అదే. దాని కారణంగా నా ప్లాన్ మొత్తం చెడింది. పర్సనల్ లైఫ్ పై దృష్టి పెట్టడం వల్ల సినీ జీవితం దెబ్బతింది అంటూ వరలక్ష్మి చెప్పుకొచ్చింది. కాగా పోడాపోడీ త‌ర్వాత శింబు, విశాల్ వంటి హీరోల‌తో వ‌ర‌ల‌క్ష్మి ప్రేమాయ‌ణం న‌డిపిన‌ట్లు పెద్ద ఎత్తున‌ వార్త‌లు వ‌చ్చాయి. విశాల్ తో వ‌ర‌ల‌క్ష్మి పెళ్లి వ‌ర‌కు వెళ్లింద‌ని అప్ప‌ట్లో కోలీవుడ్ మీడియా కోడై కూసింది.

Join WhatsApp