Varun Tej sensational decision

Varun Tej: మెగా ఫ్యామిలీని వరుణ్ తేజ్ రెండుగా విడగొట్టారా.. నిజంగానే వరుణ్ తేజ్ నిర్ణయం అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిందా..ఇంతకీ వరుణ్ తేజ్ తీసుకున్నా నిర్ణయం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తో పెళ్లయ్యాక ఒక పని చేయాలని ముందుగానే అనుకున్నారట. అయితే పెళ్లయ్యే వరకు తన నిర్ణయాన్ని ఎక్కడా కూడా బయట పెట్టలేదట. ఇక చాలా మంది హీరోలు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సొంతంగా బ్యానర్లు పెడుతూ ఉంటారు.

Varun Tej sensational decision

ఇప్పటికే అలా చాలామంది స్టార్ హీరోలకు సొంత బ్యానర్స్ ఉన్నాయి. అయితే మెగా ఫ్యామిలీకి కూడా కొణిదెల అనే బ్యానర్ ఉంది. అలాగే నాగబాబు కూతురు నిహారిక కూడా కొత్తగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అని ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసింది. అయితే తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారట.(Varun Tej)

Also Read: Devi Sri Prasad: త్రివిక్రమ్ వల్లే దేవిశ్రీ ప్రసాద్ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోలేకపోయారా.?

అయితే ఈ నిర్ణయం కేవలం వరుణ్ తేజ్ ది మాత్రమే కాదు లావణ్య త్రిపాఠిది కూడా అని తెలుస్తోంది. వీరిద్దరూ అనుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాదు మెగా ఫ్యామిలీలో ఇప్పటికే కొణిదెల అనే బ్యానర్ ఉంది.కానీ ఇదే బ్యానర్ తో మళ్ళీ వరుణ్ తేజ్ కూడా కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నారట.

Varun Tej sensational decision

దీంతో ఈ విషయం తెలిసిన కొంతమంది మెగా హేటర్స్ ఏంటి ఒకే ఫ్యామిలీలో రెండు బ్యానర్స్ ఆ ఇద్దరి మధ్య ఏవైనా గొడవలు జరిగాయా.. లేకపోతే మరేదైనా విషయముందా..అసలు మెగా ఫ్యామిలీ లో ఏం జరుగుతుంది..ఒకే ఇంట్లో రెండు బ్యానర్లు ఏంటి అంటూనే నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనాప్పటికీ వరుణ్ తేజ్ తీసుకున్న నిర్ణయంతో నెట్టింట్లో మెగా ఫ్యామిలీ లో గొడవలు జరుగుతున్నాయనే వార్త జోరందుకుంది.(Varun Tej)

Join WhatsApp