Vasundhara Devi Favourite Movie In Balakrishna Career

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఓవైపు సినిమా ప‌రిశ్ర‌మ‌లో హీరోగా స‌త్తా చాటుతూనే.. మ‌రోవైపు ప్ర‌జా సేవ చేస్తూ రాజ‌కీయ నాయకుడిగా దూసుకుపోతున్నారు. అయితే బాల‌య్య రీల్ లైఫ్ లో న‌టుడిగా, రియ‌ల్ లైఫ్‌లో పొలిటిక‌ల్ లీడ‌ర్ గా స‌క్సెస్ ఫుల్ జ‌ర్నీని కొనుగిస్తున్నారంటే.. దాని వెన‌క ఆయ‌న భార్య వ‌సుంధ‌ర దేవి గారి క‌ష్టం, కృషి ఎంతో ఉంది. వసుంధర శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్ పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యరావు కుమార్తె అయిన వ‌సుంధ‌ర‌.. 1982లో బాల‌య్య‌ను వివాహం చేసుకుని నంద‌మూరి వారి ఇంటికి కోడ‌లిగా అడుగు పెట్టింది.

Vasundhara Devi Favourite Movie In Balakrishna Career

పెళ్లి తర్వాత కుటుంబ వ్యవహారాలు అన్నింటిని తన భుజాన వేసుకున్న వసుంధ‌ర.. భర్తకు అన్నివేళలా చేదోడు వాదోడుగా నిలిచారు. పాలిటిక‌ల్స్‌, సినిమాలు, వ్యాపారాలంటూ బాల‌య్య అనునిత్యం బిజీగా ఉన్నా.. వ‌సుంధ‌ర ఆయ‌న వెన్నంటే న‌డిచారు. భ‌ర్త చేసే ప్ర‌తి ప‌నిలో తోడుగా ఉంటూ వ‌చ్చారు. అలాగే ఇద్దరు కుమార్తెల‌ను మ‌రియు ఒక కుమారుడిని ఎటువంటి రిమార్క్ లేకుండా పెంచి పెద్ద చేశారు.

అటువంటి వ‌సుంధ‌ర‌కు త‌న భ‌ర్త న‌టించిన చిత్రాల్లో అత్యంత ఇష్ట‌మైన సినిమా ఏదో తెలుసా..? సమర సింహా రెడ్డి. అవును, గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో వ‌సుంధ‌ర ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు. ఫ్యాక్షనిజం నేప‌థ్యంలో బి.గోపాల్ తెర‌కెక్కించిన‌ స‌మ‌ర సింహా రెడ్డి చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా సిమ్రాన్, అంజలా జవేరి న‌టించారు. కేవ‌లం రూ. 6 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ సినిమా.. 1999లో సంక్రాంతి కానుక‌గా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.(Balakrishna)

Also Read: Rakul Preet Singh: థాయిలాండ్ లో రకుల్-జాకీ బ్యాచిలర్ పార్టీ.. టాలీవుడ్ నుంచి ఆ ఇద్ద‌రికే ఆహ్వానం!

బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించింది. అయితే బాల‌య్య ఫిల్మ్ కెరీర్ లో స‌మ‌ర సింహా రెడ్డి సినిమా అంటే ఆయ‌న స‌తీమ‌ణి వ‌సుంధ‌ర‌కు ఎంతో ఇష్ట‌మ‌ట‌. అనేక సార్లు ఆ చిత్రాన్ని చూశారు. అలాగే బాల‌య్య చేసే ప్ర‌తి సినిమాను ఆమె ఎంతో ఎంజాయ్ చేస్తూ చూస్తార‌ట‌. కాగా, బాల‌కృష్ణ ప్ర‌స్తుతం వ‌రుస హిట్స్ తో ఫుల్ జోష్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అఖండ‌, వీర సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాలు అందుకున్న బాల‌య్య‌.. ఇప్పుడు బాబీ డైరెక్ష‌న్ లో త‌న 109వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది.

Join WhatsApp