Venkatesh blocked the Balakrishna number

Venkatesh : సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి వెంకటేష్ కి, నందమూరి బాలకృష్ణ ఇద్దరికీ మంచి గుర్తింపు ఉంది. ఇక నందమూరి బాలకృష్ణ తన తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్నారు. ఇక దగ్గుబాటి వెంకటేష్ తన తండ్రి నిర్మాతగా రాణిస్తే ఈయన మాత్రం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే అలాంటి ఈ ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి.. వెంకటేష్ బాలకృష్ణ నెంబర్ ని బ్లాక్ చేసే అంత వైరం వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Venkatesh blocked the Balakrishna number

దగ్గుబాటి, నందమూరి ఫ్యామిలీస్ మధ్య మంచి అనుబంధమే ఉంది.అయితే వీరిద్దరి మధ్య గొడవలు రావడానికి ప్రధాన కారణం ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో నట.అసలు విషయం ఏమిటంటే..బాలకృష్ణ ఇప్పటికే తన అన్ స్టాపబుల్ షోకి ఎంతోమంది రాజకీయ, సినీ సెలబ్రిటీలను ఆహ్వానించారు బాలకృష్ణ.(Venkatesh )

Also Read: Shweta Mohan: పెళ్ళై పిల్లలున్నా ఇంకా ఆ హీరోనే కావాలనిపిస్తుంది.. సింగర్ శ్వేతా మోహన్ కామెంట్స్ వైరల్..!!

ఇందులో భాగంగా వెంకటేష్ ని కూడా తన షోకి రమ్మని పలుమార్లు ఆహ్వానించారట బాలకృష్ణ.కానీ వెంకటేష్ కి తన సినిమా ప్రమోషన్స్ తప్ప వేరే ఏ షోకి కూడా వెళ్లడం ఇష్టం ఉండదట. ఈ కారణంతో బాలకృష్ణ చెప్పినప్పుడల్లా సరేలేండి చూద్దాం అంటూ వచ్చారట. కానీ బాలకృష్ణ ఓసారి కంటిన్యూస్ గా ఫోన్ చేసి మీరు మా షో కి రావాల్సిందే అని వెంకటేష్ కి విసుకు తెప్పించారట.

Venkatesh blocked the Balakrishna number

దీంతో కోపం లో ఉన్న వెంకటేష్ బాలకృష్ణ నెంబర్ ని బ్లాక్ చేసి పెట్టారట. అయితే ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొట్టడంతో అసలు ఇందులో ఎంత నిజం ఉంది అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అంతే కాదు ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో నందమూరి బాలకృష్ణ కి వెంకటేష్ తో విభేదాలు నిజమేనా అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.(Venkatesh )

Join WhatsApp