Vennela Kishore Reveals Why He Avoids Movie Pre Release Events

Vennela Kishore: టాలీవుడ్ లో ఉన్న టాప్ క‌మెడియ‌న్స్ లో వెన్నెల కిషోర్ ఒక‌రు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి సినిమాల్లోకి వ‌చ్చిన వెన్నెల కిషోర్‌.. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మోస్ట్ వాంటెడ్ క‌మెడియ‌న్ గా మారాడు. ఒక్క 2022లోనే వెన్నెల కిషోర్ 25కు పైగా చిత్రాల్లో క‌నిపించాడంటే అత‌ని క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే త‌న‌దైన కామెడీ టైమింగ్ తో వెండితెర‌పై న‌వ్వులు పంచే వెన్నెల కిషోర్‌.. ఇప్పుడు హీరోగా మారాడు.

Vennela Kishore Reveals Why He Avoids Movie Pre Release Events

త్వ‌ర‌లోనే చారి 111 మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించబోతున్నాడు. టీజీ కీర్తి కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, సంయుక్తా విశ్వనాథన్ జంట‌గా న‌టించారు. మురళీశర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్‌ రవీంద్రన్‌, పావనిరెడ్డి త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. బర్కత్‌ స్టూడియోస్‌ పతాకంపై అదితి సోనీ నిర్మించిన చారి 111 మార్చి 1న విడుదల కాబోతోంది.

రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో చిత్ర‌టీమ్ జోరుగా ప్ర‌చార‌కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న వెన్నెల కిషోర్‌.. అనేక ఇంట్రెస్టింగ్ విష‌యాలు పంచుకున్నాడు. అయితే సినిమా ఈవెంట్స్ కి వెన్నెల కిషోర్ రాడు అన్న రిమార్క్ ఎప్ప‌టి నుంచో అతనిపై ఉంది. ఈ విష‌యంపై శ‌ర్వానంద్ తో స‌హా ప‌లువురు హీరోలు ప‌బ్లిక్‌గానే వెన్నెల కిషోర్ పై సెటైర్లు పేల్చిన సంద‌ర్భాలు ఉన్నాయి.(Vennela Kishore)

Also Read: Mahesh Babu: ఐదు సెకన్లకు రూ. 5 కోట్లా.. మ‌హేషా ఇది మ‌రీ టూ మ‌చ్‌!

అయితే సినిమా ఈవెంట్స్ కు తాను ఎందుకు దూరంగా ఉంటోనో వెన్నెల కిషోర్ చెప్పేశాడు. తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. త‌న‌కు చిన్న‌త‌నం నుంచి స్టేజి ఫియర్ ఉంద‌ని.. భారీ క్రౌడ్‌ని తాను ఫేస్ చేయ‌లేన‌ని వెన్నెల కిషోర్ స్ప‌ష్టం చేశాడు. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఒకరు పొగుడుతుంటే ఎలా రియాక్ట్ అవ్వాలి.. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి అన్న‌ది త‌న‌కు తెలియ‌ని, అలాంటి టైమ్ లో ఫుల్ టెన్ష‌న్ వ‌స్తుంద‌ని వెన్నెల కిషోర్ తెలిపాడు. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మ‌రియు ఇత‌ర సినిమా ఈవెంట్స్ కు దూరంగా ఉంటాన‌ని చెప్పుకొచ్చాడు.

Join WhatsApp