Venu Swamy biopic

Venu Swamy: సెలబ్రెటీల జాతకాలు చెప్తూ ఇండస్ట్రీలో ఎంతో పాపులర్ అయిన వేణు స్వామి బయోపిక్ ని ఆ దర్శకుడు తీశారా.. నిజంగానే వేణు స్వామి బయోపిక్ వచ్చిందా.. ఇన్ని రోజులు ఈ విషయం మాకు తెలియదే అంటున్నారు సోషల్ మీడియా జనాలు. ఇక ఇంకొంతమందేమో వేణు స్వామి బయోపిక్ ఆ సినిమానా అని తెలిసి నిజంగా అది వేణు స్వామి బయోపిక్ కా అని నోరెళ్ళబెడుతున్నారు. మరి ఇంతకీ వేణు స్వామి బయోపిక్ గా వచ్చిన సినిమా ఏంటి..అందులో నటించిన హీరో ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Venu Swamy biopic

సెలబ్రిటీల పర్సనల్ విషయాలు చెబుతూ కాంట్రవర్సీ జ్యోతిష్యుడి గా పేరు తెచ్చుకున్న వేణు స్వామి బయోపిక్ గా తెరకెక్కిన సినిమా ఏదో కాదు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన అదుర్స్ సినిమా నట.. వి వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ మూవీ లో ఎన్టీఆర్ నరసింహ, చారి అనే రెండు పాత్రల్లో నటించారు. అలాగే ఈ సినిమాలో నయనతార, షిలా కౌర్ లు హీరోయిన్స్ గా చేశారు. (Venu Swamy)

Also Read: Premisthe: “ప్రేమిస్తే” మూవీలో సంధ్య పాత్రని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

అంతేకాకుండా ఈ సినిమాలో బ్రహ్మానందం, ఎన్టీఆర్ ల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఎంత ఫన్నీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి ఈ అదుర్స్ వేణు స్వామి బయోపిక్ అని స్వయంగా ఈ విషయాన్ని వేణు స్వామి బయట పెట్టడం ప్రస్తుతం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఇక అదుర్స్ సినిమా నా బయోపిక్ గా తెరకెక్కింది అని, ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించిన రెండు పాత్రలు నావేనని, అలాగే సినిమా పూజ కార్యక్రమాల సమయంలో ఎన్టీఆర్ కొబ్బరికాయ కొట్టగా అందులో పువ్వు రావడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుంది అని ముందుగానే చెప్పాను.

Venu Swamy biopic

నేను చెప్పినట్లే అదుర్స్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలిసిందే అంటూ వేణు స్వామి మాట్లాడివీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో అదుర్స్ సినిమా వేణు స్వామి బయోపిక్ హా అంటూ చాలామంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు

Join WhatsApp