Vijay Shanti in Chiru "Vishvambara"

Vijay Shanti: వెండి తెరపై విజయశాంతి తిరుగులేని కథానాయకగా గుర్తింపును సంపాదించుకుంది. లేడీ అమితాబ్ గా యాక్షన్ సినిమాలోనూ తన నటనను ప్రూవ్ చేసుకుంది. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆమె నటనకు దూరంగా ఉంటూ వచ్చింది. చాలా గ్యాప్ అనంతారం సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో ఒక ఆర్మీ ఆఫీసర్ కి తల్లి పాత్ర పోషించింది. ఇక అప్పటినుంచి విజయశాంతి వరుస సినిమాలు చేస్తారని అందరూ భావించారు. కానీ అది మాత్రం జరగలేదు.

Vijay Shanti in Chiru “Vishvambara”

ఆ సినిమా అనంతరం విజయశాంతి ఏ సినిమాలోను కనిపించలేదు. ఈమె వెండి తెరపై కనిపిస్తే ఈమె ఫ్యాన్స్ కి ఒక పండగనే చెప్పుకోవచ్చు. ఇక మళ్లీ ఇప్పుడు విశ్వంభరా సినిమా విషయంలో ఆమె పేరు వినిపిస్తుంది. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీనే విశ్వంభరా. యు వి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ కథలో త్రిష కనిపించనుంది. త్రిష మరియు చిరంజీవి ఇద్దరు కూడా స్టాలిన్ తరువాత కలిసి నటిస్తున్న మొట్టమొదటి సినిమా ఇది.

Also Read: Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. సమంత, రకుల్ మాత్రమే కాదు ఆ 13 మంది హీరోయిన్స్ కూడా..?

విశ్వంబరా లో ఒక కీలకమైన పాత్ర ఉందట. ఇక ఆ పాత్రను విజయశాంతి చేస్తే బాగుంటుందని భావించిన టీం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి మరియు విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక వీరిద్దరింకి పాలిటిక్స్ లో గొడవలు వచ్చినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం వీరిది బెస్ట్ కాంబినేషన్. ఎక్కడిది అక్కడే వదిలేయాలి అని భావించే ఇద్దరు రాజకీయాలని ఒక వైపు చూస్తూ సినిమా ఇండస్ట్రీని మరొకవైపు చూస్తూ ఉంటారు.

Vijay Shanti in Chiru "Vishvambara"

ఇక ఈ నేపథ్యంలోనే విజయశాంతి సైతం ఈ సినిమాకి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. చాలా గ్యాప్ అనంతరం మళ్లీ వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాను జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఏదేమైనాప్పటికీ మళ్లీ చిరు మరియు విజయశాంతి కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ ఆనందంలో మునుగు తేలుతున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత వీరిద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపించబోతుంటే వారి ఫాన్స్ దానిని పండగ లాగా ఫీల్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ మూవీపై మరిన్ని హైప్స్ పెరిగిపోయాయి.(Vijay Shanti)

Join WhatsApp