Villain Sampath Raj's wife is that star heroine

Sampath Raj: విలన్ సంపత్ రాజ్ అంటే అందరికీ తెలిసిన ఆర్టిస్టే. ఈయన ఎన్నో సినిమాల్లో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఈ మధ్యకాలంలో కామెడీ విలన్ గా కూడా చేస్తున్నారు. ఎక్కువ సినిమాల్లో పోలీస్ పాత్రల్లో, విలన్ గా నటించారు. అలా ఈయన మిర్చి, బ్రహ్మోత్సవం,ఎఫ్ 3 , బంగార్రాజు, సోగ్గాడే చిన్ని నాయన, సన్నాఫ్ సత్యమూర్తి, లౌక్యం, భీష్మ, బాబు బంగారం, శ్రీమంతుడు, వెంకీ మామ, రెడ్ వంటి ఎన్నో సినిమాల్లో ఈయన నటించారు. అయితే అలాంటి విలన్ సంపత్ రాజ్ ఇండస్ట్రీలో ఉంటే చాలామంది విలన్ గా నటించే వారికి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు.

Villain Sampath Raj’s Wife is that Star Heroine

ఈయన వల్ల ప్రకాష్ రాజ్, జగపతిబాబు వంటి వారికి గట్టి పోటీ ఎదురవుతుంది. అయితే చాలామందికి సంపత్ రాజ్ వ్యక్తిగత జీవితం తెలియదు. ఇక సంపత్ రాజ్ భార్య ఆ స్టార్ హీరోయిన్ అనే సంగతి కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన భార్యతో విడాకులు తీసుకున్నారు కాబట్టి. ఇక సంపత్ రాజ్ భార్య ఎవరో కాదు అప్పట్లో నటిగా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఎంతోమంచి ఇమేజ్ సంపాదించిన శరణ్య పొన్వన్నన్ . సంపత్ రాజ్ కి 23 ఏళ్ల వయసులో శరణ్యను ఇచ్చి పెళ్లి చేశారట.అయితే ఆ సమయంలో వీరిద్దరిది చిన్న వయసు కావడంతో ఇద్దరిమధ్య అండర్స్టాండింగ్ ఏర్పడక ఎన్నో విభేదాలు వచ్చాయట.

Also Read: Puri Jagannath: లావణ్య కి విడాకులు ఇచ్చి స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న పూరి… దారుణంగా ఏకేస్తున్న ప్రేక్షకులు..!

ఇక ఆ సమయంలో వీరికి కూతురు కూడా పుట్టిందట. కూతురు పుట్టినా కూడా వీరి మధ్య గొడవలు ఆగకపోవడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత సంపత్ రాజ్ సినిమాల్లో చాలా బిజీ అయ్యారు.ఇక ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సంపత్ తన భార్య శరణ్య గురించి మాట్లాడుతూ.. మేము ఒకవేళ విడాకులు తీసుకోకుండా ఉంటే మాత్రం ఆమె నన్ను చంపడం లేదా నేను ఆమెను చంపడం జరిగేది అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

 Villain Sampath Raj's wife is that star heroine

ఇక విడాకుల సమయంలో శరణ్య కి సంపత్ రాజ్ కి పుట్టిన బిడ్డ సంపత్ రాజ్ దగ్గరే ఉందట. అలాగే తన బిడ్డ అప్పుడప్పుడు తన తల్లి శరణ్య ని కూడా కలుస్తుందని చెప్పారు. ఇక శరణ్య సంపత్ రాజ్ తో విడాకుల తర్వాత తమిళ నటుడు పొన్వన్నన్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు కూతుర్లకు జన్మనిచ్చింది.ఇక శరణ్య కూడా ఇప్పటికీ సీనీ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గానే ఉంటుంది.చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రల్లో నటిస్తోంది. ఇక శరణ్య పెళ్లి చేసుకున్నప్పటికీ సంపత్ రాజ్ మాత్రం రెండో పెళ్లి చేసుకోలేదు. ఆయన తన కూతురు టీనేజ్ కి రావడంతో కూతురు బాగోగులు చూసుకోవడానికి పెళ్లికి దూరంగా ఉన్నారు.(Sampath Raj)

Join WhatsApp