Virat Kohli and Anushka Sharma leaving Mumbai forever?

Anushka Sharma: వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో ఎనలేని కీర్తి సంపాదించుకున్న‌ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుస్క శ‌ర్మ దంప‌తులు ఇటీవల రెండోసారి త‌ల్లిదండ్రులు అయిన సంగ‌తి తెలిసిందే. 2013లో ఓ షాంపు యాడ్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ యాడ్ ద్వారా ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి పెళ్లికి దారితీసింది. పెద్దల అంగీకారంతో 2017 డిసెంబర్ 11న విరాట్‌, అనుష్క‌ వివాహబంధంతో ఒక్కటయ్యారు.

Virat Kohli and Anushka Sharma leaving Mumbai forever?

విరుష్క జంట‌కు 2021లో వామిక అనే కూతురు జ‌న్మించింది. 2024 ఫిబ్ర‌వ‌రి 15న ఈ దంప‌తులు త‌మ రెండో బిడ్డ‌ను ఆహ్వానించారు. లండ‌న్ లో అనుష్క శ‌ర్మ పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. కుమారుడికి అకాయ్ అని నామ‌క‌ర‌ణం కూడా చేశారు. అలాగే ఈ ప్రత్యేక సమయంలో ఆశీస్సులు మరియు గోప్యతను కోరుతూ విరుష్క జంట‌ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అకాయ్ జ‌న్మించాడ‌ని తెలిపారు.

ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ దంప‌తుల గురించి ఓ షాకింగ్ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. వివాహం అనంత‌రం విరాట్‌-అనుష్క‌ ముంబైలోనే నివాసం ఉంటున్నారు. కానీ ఇక‌పై ఉండేది మాత్రం ముంబైలో కాద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. విరుష్క జంట శాశ్వ‌తంగా ముంబైని వీడ‌బోతున్నార‌ని.. UKకి మకాం మార్చబోతున్నార‌ని అంటున్నారు. కూతురు వామిక మ‌రియు కొడుకు అకాయ్ తో క‌లిసి విరుష్క జంట లండ‌ర్ లో సెట‌ల్ కాబోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.(Anushka Sharma)

Also Read: Jagapathi Babu: సినిమాల్లోకి రాక‌పోయుంటే జ‌గ‌ప‌తిబాబు ఏం అయ్యేవారో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

అందుకే అనుష్క శ‌ర్మ అకాయ్ కు లండ‌న్ లో జ‌న్మ‌నిచ్చింద‌ని అంటున్నారు. విరాట్ కోహ్లీ వృత్తిపరమైన కమిట్‌మెంట్‌ల కోసం ఇటీవ‌ల ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆ టైమ్‌లో అనుష్క శర్మ మాత్రం పిల్లలతో లండన్‌లోనే ఉంది. దీంతో ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరింది. మ‌రి నిజంగా విరుష్క జంట UKలో స్థిర‌ప‌డాల‌ని నిర్ణయించుకున్నారా లేదా అనేది కాలమే నిర్ణ‌యించాలి. కాగా, విరాట్ కోహ్లీ ప్ర‌స్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క రాబోయే సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈసారి ఎలాగైనా క‌ప్ కొట్టాల‌ని ఆశ‌ప‌డుతున్నాడు.

Join WhatsApp