Vishwak Sen is following the star hero

Vishwak Sen: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన విశ్వక్సేన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు విశ్వక్సేన్. ఇక విశ్వక్సేన్ తాను నటించిన సినిమాలతో కంటే కాంట్రవర్షియల్ కామెంట్స్ తోనే ఎక్కువ వైరల్ అయ్యాడని చెప్పడంలో ఎటువంటి మోహమాటం లేదు. స్టార్ హీరో మరియు డైరెక్టర్స్ అనే గౌరవం కూడా లేకుండా తన నోటికి వచ్చిన విధంగా కామెంట్స్ చేస్తూ తనదైన రీతిలో గుర్తింపు పొందాడు విశ్వక్సేన్. ఇక ఇటీవలే బేబీ డైరెక్టర్ ని కించపరుస్తూ ఈయన చేసిన ఓ ఇన్సిడెంట్ ఆ మధ్యకాలంలో ఫుల్ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.

Vishwak Sen is following the star hero

నువ్వు కూడా అదే స్టేజ్ నుంచి వచ్చావు కదా.. మరి నీకెందుకు అంత బడప్.. అంటూ విశ్వక్సేన్పై ఘోరమైన ట్రోల్స్ సైతం జరిగాయి. ఇక ఆరేళ్లుగా ఈనా కష్టపడినా కష్టం తాజాగా సినిమా రూపంలో విడుదలై మంచి విజయం దక్కించుకుంది. ఆ విజయవంతమైన సినిమా పేరే గామి. దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఈ మూవీ షూటింగ్ చిత్రీకరించాడు డైరెక్టర్. హిమాలయాల మంచి పర్వతాలలో ఈ షూటింగ్ జరిగింది. ఎంతో కష్టం మీద ఈ షూటింగ్ ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం విశ్వక్సేన్ కెరీర్ సూపర్ స్పీడ్ లో దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు.

Also Read: Kovee Sarala: కోవై సరళ మ్యారేజ్ చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..!

ఒకప్పుడు విశ్వక్సేన్ నటించిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు. కానీ గామి మూవీతో ఒకేసారి ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్సేన్. ఇక ఇలా ఉంటే విశ్వక్సేన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈయ‌న‌ ఓ హీరోని ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. మరి ఆ హీరో మరెవ్వరో కాదు రణబీర్ సింగ్. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో.. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న హీరోలలో విశ్వక్ అండ్ సిద్దుకి మంచి ఫ్యూచర్ ఉంది అని అన్నారు. ఇక తారక్ నే ఈ మాట అన్నాడంటే ఇద్దరూ కొంచెం సబ్జెక్ట్ ఉన్నవారే అని అర్థం కదా? విశ్వక్సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే ఓ యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Vishwak Sen is following the star hero

ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ క్రమంలోనే ఈ మధ్య జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో.. విశ్వక్ మొత్తం నల్ల దుస్తులు ధరించి.. కొంచెం రణవీర్ సింగ్ ని ఫాలో అవుతున్నట్లు కనిపించాడు. షర్ట్ పైన పోగ్రా అండ్ మ్యాచింగ్ పంచ్.. ఇంకా అద్భుతం ఆ ఫుట్వేర్. సూపర్ హీరోలు వేసుకునే పెద్ద పెద్ద బ్లాక్ షూస్ ను విశ్వక్సేన్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అలా రణవీర్ని ఫాలో అవుతూ తనంత ఎత్తుకు ఎదిగేందుకు గట్టిగా కసరక్తులు చేస్తున్నాడు విశ్వక్సేన్. మరి ఈయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.(Vishwak Sen)

Join WhatsApp