Vishwak Sen Reacts To The Controversy With Arjun Sarja

Vishwak Sen: టాలీవుడ్ లో హీరోగా, డైరెక్ట‌ర్‌గా, ర‌చ‌యిత‌గా, నిర్మాత‌గా స‌త్తా చాటుతూ మ‌ల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ పై గ‌తంలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ స‌ర్జా ప్ర‌త్యేకంగా ప్రెస్ మీట్‌ పెట్టి మ‌రీ విమ‌ర్శ‌లు కురిపించిన‌ సంగ‌తి తెలిసిందే. అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వ‌క్ సేన్ హీరోగా ఓ సినిమా ప్రారంభ‌మైంది. కానీ, షూటింగ్ స్టార్ట్ కాక‌ముందే ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. ఆ స‌మ‌యంలోనే విశ్వ‌క్ సేన్ పై అర్జున్ నిప్పులు చెరిగారు. విశ్వ‌క్ కు కమిట్ మెంట్ లేదని, అన్ ప్రొఫెషనల్ యాక్టర్ అని, ప్రొడ్యూస‌ర్‌-డైరెక్ట‌ర్‌కు రెస్పెక్ట్ ఇవ్వ‌డని అర్జున్ ఆరోప‌ణ‌లు చేశాడు. ఇది పెద్ద ఇష్యూ అయింది.

Vishwak Sen Reacts To The Controversy With Arjun Sarja

విశ్వక్ కూడా అప్పుడే సమాధానం ఇచ్చాడు. అయితే తాజాగా గామి సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న విశ్వ‌క్ సేన్.. మ‌రోసారి ఆ ఇష్యూపై ఓపెన్ అయ్యాడు. అర్జున్ సినిమాలో తాను న‌టించ‌న‌ని చెప్ప‌లేద‌ని.. కొన్ని కార‌ణాల వ‌ల్ల కేవ‌లం ఒక్క రోజు షూటింగ్ ఆప‌మ‌ని మాత్ర‌మే అడిగాన‌ని విశ్వ‌క్ సేన్ చెప్పుకొచ్చారు. ఒక రోజు షూటింగ్ ఆపమంటే, ఆయన ఏకంగా సినిమానే ఆపేశారని విశ్వ‌క్ అన్నారు.

ఈ బచ్చాగాడు ఎవడు, వీడికి బ్యాగ్రౌండ్ కూడా లేదు, వీడు త‌న‌ షూటింగ్ ఒక రోజు ఆపడం ఏంటి అని బీపీ పెంచుకుని ప్రెస్ మీట్ పెట్టారు. ఆయ‌న చేసిన ఆ ప‌ని వ‌ల్ల నేను చాలా న‌ష్ట‌పోయాను. తీసుకున్న రెమ్యున‌రేష‌న్ కు రెండింతలు వెన‌క్కి ఇచ్చాను. చెడ్డ పేరు కూడా నాకే వ‌చ్చింది. కానీ ఏం చెయ్యలేం. ఎందుకంటే మా నాన్న సూపర్ స్టార్ కాదు.. మా తాత పెద్ద ప్రొడ్యూసర్ కాదు. నా మీద సుల‌భంగా నోరు పారేసుకోవచ్చు.(Vishwak Sen)

Also Read: Rakul Preet Singh: ర‌కుల్ తొలి సంపాద‌న ఎంత‌.. హీరోయిన్ కాక‌ముందు ఏం ప‌ని చేసేదో తెలుసా?

నాకు జ‌రిగిందే బ్యాగ్రౌండ్ ఉన్న హీరోకు జ‌రిగితే రియాక్ష‌న్ వేరేగా ఉంటుంది. అస‌లు నేను చేసిన మిస్టేక్ లెగసీ ఉన్న ఫ్యామిలీ హీరోలు చేస్తే, నిజంగా ఇంతే ధైర్యంగా వాళ్ళని అనగలుగుతారా? అంటూ విశ్వ‌క్ సేన్ ప‌రోక్షంగా అర్జున్ తీరు ప‌ట్ల ఫైర్ అయ్యాడు. అలాగే త‌న‌కు ఎంత న‌ష్టం జ‌రిగినా స‌రే తాను ఆ వివాదాన్ని మ‌రింత లాగాల‌ని భావించ‌లేద‌ని.. ఒక చెడ్డ సినిమా కంటే ఒక చెడ్డ రోజు మంచిదనుకుని వదిలేశాన‌ని విశ్వ‌క్ సేన్ పేర్కొన్నాడు. దీంతో ఇప్పుడు ఈ యంగ్ హీరో కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, గామి మూవీ విషయానికి వ‌స్తే.. విద్యాధర్ కాగిత తెర‌కెక్కించిన ఈ చిత్రం మార్చి 8న విడుద‌ల కాబోతోంది. ఇందులో మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధ‌ప‌డే అఘోరాగా విశ్వ‌క్ క‌నిపించ‌బోతున్నాడు.

Join WhatsApp