Vithika Sheru finally responded on having children

Vithika Sheru: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరులలో వితికా పేరు కూడా ఒకటి. 2009లో ప్రేమించే రోజుల్లో మరి సినిమాతో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఇక సినిమా తర్వాత పలు చిత్రాల్లో కూడా కథానాయకగా నటించింది. కథానాయకగా సరైన అవకాశాలు రాకపోవడంతో అటు సెకండ్ హీరోయిన్ గాను.. సహాయ పాత్రలలోనూ కనిపించింది. నాచురల్ స్టార్ నాని నటించిన భీమిలి సినిమాలో కనిపించింది. ఇక 2017లో యంగ్ హీరో వరుణ్ సందేశ్ జోడిగా పడ్డీనండి ప్రేమలో నటించింది. అదే ఏడాది వీరిద్దరూ వివాహం బంధంలోకి కూడా అడుగు పెట్టారు.

Vithika Sheru finally responded on having children

పెళ్లి అనంతరం కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న వీరు.‌.. బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అయితే ఈ షో సమయంలో వితికా పై నెగిటివిటీ ఎక్కువగా వచ్చింది. దీంతో చాలా రోజులు డిప్రెషన్ లో ఉండిపోయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం యూట్యూబ్ లో సొంతంగా ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబర్గా మారింది. ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తూ బిజీగా తన లైఫ్ను కొనసాగిస్తుంది. ఇక ప్రస్తుతం వరుణ్ సందేశ్ సినిమాలతో బిజీగా ఉండగా యూట్యూబ్ గా కూడా రానిస్తున్నాడు. కానీ వీరిద్దరి గురించి నిత్యం ఓ ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది.

Also Read: Venkatesh: వెంకటేష్ ని అసహ్యించుకుని వెళ్లిపోయిన రోజా.. కారణం ఇదే..!

పిల్లలు ఎప్పుడు కంటారు? అనే ప్రశ్న కొన్ని సంవత్సరాల నుంచి వినిపిస్తూ ఉంది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వితిక ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ” 2016 లో పెళ్లయిన తర్వాత మేము అమెరికాలో సెటిల్ అయిపోవాలని అక్కడికి వెళ్ళాం. అక్కడే కొంతకాలం ఉన్నాం కూడా. 2018లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అందరికీ చాలా సంతోషంగా చెప్పాం కూడా. కానీ కొన్ని రోజులకే గర్భాస్రావం అయ్యింది. ఇండియాకు వచ్చాక రెండు నెలలకు మళ్లీ ఆసుపత్రికి వెళితే ప్రెగ్నెంట్ అని చెప్పారు. కొద్దిరోజుల క్రితమే గర్భాస్రావం అయిందని చెప్పాను.

Vithika Sheru finally responded on having children

అప్పుడు డాక్టర్ స్కానింగ్ చేయడంతో బేబీ చిన్న ముక్క లోపలే ఉండిపోయిందని అన్నారు. మరొకసారి ఆపరేషన్ చేసి దానిని తీయాలని చెప్పారు. ఆ ఘటన తరువాత మేమందరం బిగ్ బాస్ కు వెళ్లాం. తరువాత ప్రాజెక్ట్స్ రావడం మరియు ఫైనాన్షియల్ గా సెటిల్ కావడం జరిగింది. పిల్లలను ఎవరు వద్దనుకుంటారు. ఆ క్షణం వస్తే అందరికీ తప్పకుండా చెప్తాం ” అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Vithika Sheru)

Join WhatsApp