What is that curry that Prabhas doesn't like

Prabhas: ప్రస్తుతం ప్రభాస్ పేరు ఇండస్ట్రీలో చాలా స్పెషల్..ఎందుకంటే ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.అయితే చాలామంది హీరోలు ఒకటో రెండో పాన్ ఇండియా సినిమాలు చేస్తారు. కానీ ప్రభాస్ మాత్రం ఆయన చేసే సినిమాలు వరుసగా పాన్ ఇండియా మూవీస్ కావడంతో సౌత్ లో ఈయన స్పెషల్ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఇన్ని సినిమాలు ఆయన చేతిలో ఉన్నా కూడా సినిమా షూటింగ్స్ కోసం గ్లామర్ మెయింటైన్ చేయడం కోసం ఎలాంటి డైట్లు చేయరు.

What is that curry that Prabhas doesn’t like

మరీ ముఖ్యంగా ప్రభాస్ మంచి ఫుడీ..ఆయనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా నైట్ డిన్నర్ లో ముక్క లేనిదే ముద్ద దిగదట. ఆయన మటన్,చికెన్,ఫ్రాన్స్ చాలా ఇష్టంగా తింటారట.కానీ ఫుడ్ ని ఎంతో ఇష్టంగా తినే ప్రభాస్ తన ప్లేట్లో ఆ ఒక్క కూర వేస్తే మాత్రం అస్సలు అన్నం తినరట.అంతేకాదు ఆ పూట అన్నం కూడా తినడం మానేస్తారట.మరి ఇంతకీ ప్రభాస్ కి నచ్చని ఆ కర్రీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..(Prabhas)

Also Read: Prabhas: ప్ర‌భాస్ పై ప్రేమ పుకార్లు.. అనుష్కతో స‌హా డార్లింగ్ లిస్ట్ లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నారో తెలుసా?

ప్రభాస్ రాజుల వంశానికి చెందినవాడు కాబట్టి ఆయన అలవాట్లు కూడా రాజులాగే ఉంటాయి. ఇక తనతో ఎవరు నటించినా సరే వారికి తన ఇంటికి తీసుకెళ్లి స్పెషల్ భోజనం పెట్టిస్తాడు. ఇక ఇప్పటికే తనతో నటించిన చాలామంది నటీనటులకు తన ఇంటి భోజనాన్ని రుచి చూపించాడు. అంతే కాదు షూటింగ్స్ స్పాట్ కి కూడా ఇంటి నుండి పెద్ద పెద్ద క్యారేజీలు తీసుకువస్తాడు.

What is that curry that Prabhas doesn't like

అయితే అలాంటి ప్రభాస్ నాన్ వెజ్,వెజ్ చాలా ఇష్టంగా తింటాడు.. కానీ వెజ్ కర్రీస్ లో కాకరకాయ అంటే ప్రభాస్ కి అస్సలు నచ్చదట. కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ చిన్నప్పటి నుండి ఆయనకు కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది అనే భావన ఉండేదట. అందుకే చిన్నప్పటి నుండి ఆయన కాకరకాయ తినడం మానేశారట. ఒకవేళ పొరపాటున తన భోజనం ప్లేట్లో కాకరకాయ కర్రీ ఉంటే మాత్రం ఆ పూట భోజనం కూడా మానేస్తారట.(Prabhas)

Join WhatsApp