Chiranjeevi & Dasari Narayana Rao

Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు వంటి స్టార్ హీరోలతో ఎన్నో చిత్రాలను చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని ఏర్పరచుకున్నారు నటుడు, డైరెక్టర్ ,నిర్మాత ,దాసరి నారాయణరావు గారు.. ఎంతోమంది టాలీవుడ్ హీరోలని బ్యాలెన్స్ చేస్తూ రైటర్ గా కూడా మంచి విజయాలను అందుకున్నారు.. దాసరి నారాయణరావు కెరియర్ లోనే ఎన్నో చిత్రాలకు కథలు మాటలు స్క్రీన్ ప్లే మొత్తం ఆయనే చేసేవారట. అందుకే ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు అప్పట్లో మంచి విజయాలను అందుకున్నాయి.

What is the Quarrel Between Chiranjeevi & Dasari Narayana Rao

అయితే ఎన్టీఆర్ ,నాగేశ్వరరావు తర్వాత ఇండస్ట్రీలో అదే రేంజిలో స్టార్డం అందుకున్నటువంటి హీరోలలో చిరంజీవి కూడా ఒకరు.. దాసరి గారికి చిరంజీవి గారికి విభేదాలు ఉన్నాయని గత కొన్నేళ్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.. ఇప్పటివరకు అసలు విషయం బయటపడలేదు.. స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి ఎంతోమంది దర్శకులతో కనీసం ఒక్క సినిమా అయినా చేస్తూ ఉండేవారట. సీనియర్ హీరోలు సైతం దాసరి గారితో సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటే.. చిరంజీవి మాత్రం దాసరి గారిని పట్టించుకోకుండా తన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లేవారట.

Also Read: Apple Smartwatch: అదిరిపోయే ఫీచర్లతో ఆపిల్ స్మార్ట్ వాచ్..!

ఈ విషయం దాసరి నారాయణ గారికి తెలిసి దానివల్ల చిరంజీవి మీద కాస్త కోపం పెరిగిందని అప్పట్లో వార్తలు వినిపించాయి.ఈ విషయం తెలుసుకున్న అల్లు రామలింగయ్య అటు చిరంజీవి ఇటు దాసరి గారిని ఒప్పించి వీళ్ళ కాంబినేషన్లో లంకేశ్వరుడు అనే సినిమాని చేశారు. ఈ సినిమా డిజాస్టర్ గా మారింది.. ఈ సినిమా విషయంలో దాసరి గారికి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా ఇబ్బందిగా ఈ సినిమా చేశారని అందుకే ఇది ప్లాప్ అయ్యింది అంటూ అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందట.

Chiranjeevi & Dasari Narayana Rao

ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్లో ఏ ఒక్క సినిమా కూడా రాలేదు.. చిరంజీవి పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత దాసరి గారు చిరంజీవి మీద సెటైరికల్ గా మేస్త్రి అనే సినిమాని చేసి విమర్శకుల పాలయ్యారు. అప్పటినుంచి వాళ్ళిద్దరి మధ్య సన్నిహిత బంధం కోల్పోయారని దాసరి గారు ఎప్పుడు మోహన్ బాబుతోనే ఎక్కువగా కలిసి ఉండే వారిని.. దీంతో మోహన్ బాబుకి, దాసరి గారికి చిరంజీవి అంటే ఇష్టం లేదని వార్తలు అప్పట్లో వినిపించాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. (Chiranjeevi)

Join WhatsApp