What will be the first movie from Pawan Kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత మూడు నాలుగు నెలల నుండి పూర్తిగా సినిమాలను పక్కన పెట్టేసి తన ధ్యాస మొత్తం రాజకీయాల పైనే పెట్టారు. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఈయన చేతిలో ఉన్నాయి. అయినప్పటికీ రాజకీయాల కోసం సినిమాలను సైతం పక్కనపెట్టి పిఠాపురంలో రాత్రింబవళ్లు ప్రచారం చేశారు.ఆంధ్రప్రదేశ్లో టిడిపి కూటమి అధికారంలోకి రావడానికి ఆయన సర్వశక్తులా ప్రయత్నాలు చేశారు. ఇక ఆయన పిఠాపురం ప్రజలను ఎన్నో రకాల వాగ్దానాలు ఇచ్చి ఓట్లు వేయమని అభ్యర్థించారు.

What will be the first movie from Pawan Kalyan

అలాగే అక్కడ ఆయన తరుపున ప్రచారం చేయడానికి రామ్ చరణ్, వరుణ్ తేజ్,వైష్ణవ్ తేజ్,సాయి ధరమ్ తేజ్, వంటి కుటుంబ సభ్యులతో పాటు జబర్దస్త్ టీం తో కూడా ప్రచారం చేయించారు. అలా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి.ఇక రిజల్ట్ త్వరలోనే రాబోతుంది.ఇదంతా పక్కన పెడితే ఎన్నికలు ముగియడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫోకస్ మొత్తం సినిమాలపై పడిందట.(Pawan Kalyan)

Also Read: Anupama Parameswaran: సింపుల్ చీరలో అనుపమ.. చీర ధర ఎంతంటే..?

ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న హరిహర వీరమల్లు, ఓజి,ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాల షూటింగ్లలో పాల్గొనాలని భావిస్తున్నారట. అయితే చాలా రోజులుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ నుండి ఫస్ట్ వచ్చే మూవీ ఏంటి అనేది అభిమానుల్లో ఒక ఆసక్తి అయితే నెలకొంది.ఇక పవన్ కళ్యాణ్ నుండి వచ్చే ఫస్ట్ మూవీ అంటే అందరూ హరిహర వీరమల్లు అని అనుకుంటారు. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికీ 50% షూటింగ్ కంప్లీట్ అయిందని ఎప్పుడో వార్తలు వినిపించాయి.

What will be the first movie from Pawan Kalyan

అయితే రీసెంట్ గానే ఈ సినిమా నుండి డైరెక్టర్ కి క్రిష్ తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి.దాంతో ఈ సినిమాని కాస్త వాయిదా వేసినట్టు తెలుస్తుంది.అయితే పవన్ కళ్యాణ్ నుండి రాబోయే ఫస్ట్ మూవీ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజి అని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. ఇక వీటన్నింటి కంటే ముందు తన ఫ్యామిలీతో కలిసి ఒక వెకేషన్ ప్లాన్ చేశారట పవన్ కళ్యాణ్.(Pawan Kalyan)

Join WhatsApp