What would Jagapathi Babu do if he was not in movies?

Jagapathi Babu: సీనియర్ నటుడు జగపతిబాబు గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, దర్శకుడు అయిన వీ.బీ. రాజేంద్రప్రసాద్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జగపతిబాబు.. 1989లో సింహ‌స్వప్నం సినిమాతో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత జగన్నాటకం, పెద్దరికం వంటి సినిమాల విజయంతో హీరోగా నిలదొక్కుకున్నారు. ప్రధానంగా కుటుంబ కథా చిత్రాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువయ్యారు.

What would Jagapathi Babu do if he was not in movies?

అయితే ఒకానొక సమయంలో సరైన విజయాలు లేక‌పోవ‌డంతో హీరోగా ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. దాంతో ఆయన 2014లో లెజెండ్ మూవీతో ప్ర‌తినాయ‌కుడిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా స‌క్సెస్ ఆయ‌న‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అప్ప‌టి నుంచి విలన్ గా మరియు సహాయక నటుడిగా మెప్పిస్తూ ఫుల్ బిజీ అయ్యారు. చేతినిండా సినిమాలతో కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నారు. భాష‌తో సంబంధం లేకుండా ఏడాదికి అరడజనుకు తగ్గకుండా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.

ప్రస్తుతం పుష్ప ది రూల్, సలార్ 2 తో సహా మరికొన్ని ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. వాటి గురించి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే జ‌గ‌ప‌తిబాబు తాజాగా ఈ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అందులో తాను ఒకవేళ‌ నటుడు కాకపోయంటే ఏం అయ్యేవారో వివ‌రించారు. సినిమాల్లోకి వచ్చి ఉండకపోతే ఖచ్చితంగా సూపర్ పోలీస్ అయ్యే వాడిన‌ని.. ఇప్పుడున్న సూపర్ పోలీసుల్లాగానే లా అండ్ ఆర్డ‌ర్ ను గడగడలాడించేవాడిని. మీరేమంటారు..? జ‌గ‌ప‌తిబాబు త‌న పోస్ట్ లో రాసుకొచ్చారు.(Jagapathi Babu)

Also Read: Ananya Nagalla: అలాంటి వ్య‌క్తే భ‌ర్త‌గా కావాలంటున్న‌ అన‌న్య నాగ‌ళ్ల‌.. వైర‌ల్ గా మారిన లేటెస్ట్ కామెంట్స్‌!

అలాగే పోలీస్ డ్రెస్ లో ఉన్న త‌న ప‌వ‌ర్ ఫుల్ ఫోటోను కూడా ఎక్స్ లో పంచుకున్నాడు. దీంతో జగపతిబాబు పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. నెటిజ‌న్లు ఆయన పోస్ట్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా, జగపతిబాబు బాలీవుడ్ లో రుస్లాన్ అనే మూవీలో యాక్ట్‌ చేశాడు. ఆయుష్ శర్మ హీరోగా చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో జ‌గ‌ప‌తిబాబు పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడు. 2024 ఏప్రిల్ 26న రుస్లాన్ విడ‌దుల కానుంది. ఈ సినిమాలోని లుక్‌నే జ‌గ‌ప‌తిబాబు తాజాగా సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Join WhatsApp