Which actor rejected Chiranjeevi's film twice?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. డౌన్ టు ఎర్త్ అన్న పదానికి సరిగ్గా సరిపోతారు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆయన తన స్వయంకృషి, ప్రతిభతో ఉన్న‌త స్థానానికి చేరుకున్నారు. నెంబర్ వన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కోట్లాదిమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నారు. చిరంజీవితో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని తహతహలాడే నటీనటులు ఎంతోమంది ఉన్నారు. అలాంటిది చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి తన సినిమాల్లో రెండుసార్లు ఛాన్స్ ఇస్తానంటే నో అని చెప్పాడట ఓ హీరో.

Which actor rejected Chiranjeevi’s film twice?

ఇంతకీ అతను మరెవరో కాదు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సత్తా చాటుతున్న పృథ్వీరాజ్ ప్ర‌స్తుతం తన రాబోయే చిత్రం ఆడుజీవితం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వలస వెళ్లిన నజీబ్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. డైరెక్టర్ బ్లేస్సీ పదహారేళ్ల కల ఈ చిత్రం. పృథ్వీరాజ్ కూడా ఈ మూవీ కోసం చాలా కాలం నుంచి కష్టపడ్డాడు.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ సుకుమారన్.. చిరంజీవి తనకిచ్చిన సినిమా అవకాశాలను గుర్తు చేసుకున్నారు. పృథ్వీరాజ్ కు మొద‌ట సైరా మూవీలో ఛాన్స్ వ‌చ్చింది. ఈ హిస్టారికల్ ఫిల్మ్‌ లో ముఖ్యమైన పాత్ర కోసం చిరంజీవి పృథ్వీరాజ్‌ను స్వయంగా సంప్రదించారట. కానీ ఆ సమయంలో పృథ్వీరాజ్ త‌న కాల్షీట్స్ అన్నీ ఆడుజీవితం కోసమే ఇచ్చారట. అందువల్ల సున్నితంగా ఆయన చిరంజీవి ఆఫర్ ను తిరస్కరించారు.(Chiranjeevi)

Also Read: Save the Tigers: సేవ్ ది టైగర్స్ సిరీస్ లో జోర్దార్ సుజాత క్యారెక్ట‌ర్ ను రిజెక్ట్ చేసిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి ఎవ‌రో తెలుసా?

ఇక దాదాపు నాలుగేళ్ల తర్వాత లూసిఫర్ తెలుగు రీమేక్ ను డైరెక్టర్ చేయమని చిరంజీవి పృథ్వీరాజ్ కోరారట. అయితే అప్పుడు కూడా పృథ్వీరాజ్ నో అనే చెప్పారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే నాలుగేళ్ల క్రితం ఏ సినిమా కోసమైతే సైరాను రిజెక్ట్ చేశారో.. ఇప్పుడు కూడా అదే సినిమా కోసం లూసిఫర్ ఛాన్స్ ను పృథ్వీరాజ్ వదులుకున్నారు. ఆడుజీవితం సినిమాకు సంబంధించిన వేరే పనుల్లో బిజీగా ఉండడం వల్ల పృథ్వీరాజ్ లూసిఫర్ తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ను తిరస్కరించారు. తాజాగా పృథ్వీరాజ్ స్వయంగా ఈ విషయాలు బ‌య‌ట‌పెట్టారు. రెండుసార్లు నో చెప్పినా కూడా త‌నున్న‌ పరిస్థితిని చిరంజీవిగారు ఎంతో చ‌క్క‌గా అర్థం చేసుకున్నారని.. ఆయన చాలా మంచి వ్యక్తి అని మెగాస్టార్ పై పృథ్వీరాజ్ ప్రశంసలు కురిపించారు.

Join WhatsApp