Which Movie Rajinikanth Acted Without Taking Remuneration?

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండ‌రు. తమిళ హీరో అయినప్పటికీ తనదైన యాక్టింగ్, స్టైల్, స్వాగ్ తో రజనీ నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందారు. దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే ఏడు పదుల వయసులోనూ వరుసగా సినిమాలు చేస్తూ తన అభిమానులను మరియు ప్రేక్షకుల‌ను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ. 150 నుంచి 200 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

Which Movie Rajinikanth Acted Without Taking Remuneration?

ప్ర‌స్తుతం ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో ఒకరిగా సత్తా చాటుతున్న రజనీకాంత్.. తన లాంగ్ కెరీర్ లో పైసా తీసుకోకుండా యాక్ట్ చేసిన సినిమా ఒకటి ఉంది. అదే పాండియన్. ఎస్పీ ముత్తురామన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించి నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్, కుష్బూ జంటగా నటించారు. ప్రభాకర్, విను చక్రవర్తి, జనగరాజ్, చరణ్ రాజ్, రాధా రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1992లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

అయితే ఈ సినిమాకు రజనీకాంత్ రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. ఇందుకు ఒక కార‌ణం ఉంది. 70, 80 ద‌శ‌కాల్లో డైరెక్టర్ ఎస్పీ ముత్తురామన్ హ‌వా బాగా న‌డిచింది. అగ్ర‌హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్‌గా ఆయ‌న స‌త్తా చాటారు. ర‌జనీకాంత్ కూడా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో దాదాపు పాతిక చిత్రాలు చేశారు. ర‌జ‌నీకాంత్‌, ముత్తురామ‌న్ కాంబినేష‌న్ లో ఏడాదికి క‌నీసం రెండు మూడు సినిమాలైనా వ‌చ్చేవి.(Rajinikanth)

Also Read: Chiranjeevi: చిరంజీవి స్వ‌యంగా త‌న సినిమాల్లో రెండు సార్లు ఛాన్స్ ఇస్తే నో చెప్పిన హీరో ఎవ‌రు..?

అయితే డైరెక్టర్ ముత్తురామన్ కు అప్ప‌ట్లో ఒక‌ స్పెష‌ల్ టీమ్ ఉండేది. సినిమాటోగ్రాఫర్ వినాగం, ఎడిటర్ విట్టల్ మరియు మేకప్ ఆర్టిస్ట్ ముస్తఫాతో సహా 14 మంది కీలక సభ్యులు ఆయ‌న టీమ్ లో ఉన్నారు. ఈ 14 మంది స‌భ్యులు ముత్తురామ‌న్ సినిమాల‌కు త‌ప్పా మిగ‌తా వారి చిత్రాల‌కు ప‌నిచేసేవారు కాదు. ముత్తురామన్ హ‌వా త‌గ్గుతున్న త‌రుణంలో ఆ టెక్నీషియన్లు ఆర్థిక ఇబ్బందుల‌కు గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే వారి కోసం ఓ సినిమా చేయాల‌ని భావించిన ముత్తురామ‌న్.. ర‌జ‌నీకాంత్ ను సంప్ర‌దించ‌గా ఆయ‌న హీరోగా యాక్ట్ చేసేందుకు వెంట‌నే ఓకే చెప్పారు. మ‌రియు త‌న‌కు రెమ్యున‌రేష‌న్ కూడా వ‌ద్ద‌ని చెప్పారు. అలా అతి కొద్ది బ‌డ్జెట్ తో పట్టాలెక్కిన పాండియన్ మంచి విజ‌యాన్ని అందుకుంది. దాంతో వ‌చ్చిన లాభాల్లో ముత్తురామన్‌తో సహా డివిజన్‌లోని 14 మంది పంచుకున్నారు.

Join WhatsApp