which movies of Mahesh Babu and Ravi Teja came with the same story?

Mahesh Babu: తెలుగు ఇండ‌స్ట్రీలో ఒకే కథతో రెండు, మూడు సినిమాలు రావ‌డం కొత్తేమి కాదు. కథల కొరత ఉండడం వల్ల పాత కథల చుట్టూనే రకరకాల పాత్రలు క్రియేట్ చేసి సినిమాలు తీసిన సంద‌ర్భాలు కోక‌ల్లు. అలా వ‌చ్చిన చిత్రాల్లో కొన్ని హిట్ అవ్వ‌గా.. కొన్ని ఫ‌ట్ అయ్యాయి. అయితే ఇలా ఇంచు మించు ఒకే స్టోరీ లైన్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా సినిమాలు చేశారు. ఇక్క‌డ విశేషం ఏంటంటే.. స్టోరీ సేమ్ అయినా కూడా ఇద్ద‌రి సినిమాలు సూప‌ర్ హిట్స్ గా నిలిచాయి.

which movies of Mahesh Babu and Ravi Teja came with the same story?

ఇంత‌కీ ఒకే స్టోరీతో వ‌చ్చి సూప‌ర్ హిట్స్ గా నిలిచిన మ‌హేష్ బాబు, ర‌వితేజ సినిమాలు ఏవో కాదు ఒక్క‌డు, భ‌ద్ర‌. మ‌హేష్ బాబు కెరీర్ లో ఫ‌స్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఒక్క‌డు. గుణ‌శేఖ‌ర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో భూమిక హీరోయిన్ గా యాక్ట్ చేసింది. పరుచూరి బ్రదర్స్ క‌థ అందించ‌గా.. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ పై ఎం.ఎస్ రాజు ఒక్క‌డు చిత్రాన్ని నిర్మించారు. 2003లో సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ సినిమా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

మ‌హేష్ బాబుకు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఒక అమ్మాయిని సేవ్ చేయడానికి హీరో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అన్న‌దే ఒక్క‌డు మెయిన్ స్టోరీ. లవ్ అండ్ ఫ్యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. స‌రిగ్గా రెండేళ్ల త‌ర్వాత సేమ్ స్టోరీతో ర‌వితేజ భ‌ద్ర సినిమా చేశాడు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా న‌టించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు.(Mahesh Babu)

Also Read: Shanmukh Jaswanth: బిగ్ బ్రేకింగ్‌.. డ్రగ్స్ కేసులో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్‌!!

2005లో రిలీజ్ అయిన భ‌ద్ర మూవీ కూడా హిట్ అయింది. స‌రిగ్గా గ‌మ‌నిస్తే.. ఒక్కడు, భ‌ద్ర ఈ రెండు చిత్రాల్లోనూ ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్ ఉంటుంది. ప్రాబ్ల‌మ్స్ లో ఉన్న హీరోయిన్ ను హీరో త‌న ఇంటికి తెచ్చుకుని పెట్టుకుంటాడు. ఆమె కోసం చివ‌రి వ‌రకు ఫైట్ చేస్తాడు. ట్రీట్మెంట్ వేరైన‌ప్ప‌టికీ ఒకే క‌థ‌తో ఒక్క‌డు, భ‌ద్ర చిత్రాలు వ‌చ్చాయి. పైగా రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించాయి.

Join WhatsApp