Who insulted Nithiin saying you are a hero

Nithiin: జయం మూవీతో తెలుగు చిత్ర సీమ పరిశ్రమంలోకి మొదటిసారి హీరోగా పరిచయమయ్యారు హీరో నితిన్.. ఈ సినిమా హిట్ అవడంతో నితిన్ కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.. ఆ క్రేజ్ ఆయనకి చాలా సినిమాల వరకు ఉపయోగపడింది. అయితే ఇప్పటికే ఆయన టైర్ 2 హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక ఈయన నటించిన జయం, సై, గుండెజారి గల్లంతయ్యిందే,ఇష్క్, దిల్ వంటి మూవీస్ ఇండస్ట్రీలో ఈయనకు మంచి ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి.

Who insulted Nithiin saying you are a hero

అయితే అలాంటి హీరో నితిన్ ని ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి చాలా దారుణంగా అవమానించారట.. మరి ఆయన ఎవరు.. ఎందుకు అంతలా అవమానించారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. నితిన్ కి జయం సినిమా సమయంలో నటుడు శివాజీ వాయిస్ అందించారు.అయితే శివాజీ వాయిస్ నితిన్ కి బాగా సెట్ అయింది.కానీ ఆ తర్వాత నితిన్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నప్పటికీ తన వాయిస్ కారణంగా ఆయన విమర్శల పాలయ్యారు.(Nithiin)

Also Read: Uday kiran: ఆరోజు రాత్రే ఉదయ్ కిరణ్ సూసైడ్.. కానీ ఆపింది ఎవరంటే..?

అయితే ఒకానొక సమయంలో ఈయన నటించిన సినిమాలన్నీ ఇండస్ట్రీలో డిజాస్టర్ అవ్వడంతో నితిన్ పని అయిపోయింది అని అందరూ భావించారు. ఇక ఆ సమయంలో కండలు పెంచుతూ అవకాశాల కోసం ఎంతో పాకులాడారు నితిన్.ఇక అలా చేసిన సమయంలో ఇండస్ట్రీలో ఉండే ఒక పెద్దాయన అసలు నువ్వు హీరోలానే లేవు..కండలు పెంచితే ఎవరైనా హీరోలు అవుతారా..అచ్చం మహమ్మద్ గజినీలాగా అతి చేస్తున్నావ్. అవసరమా నీకు ఇవన్నీ.. అసలు నువ్వు ఇండస్ట్రీలో నుండి వెళ్ళిపో నీకు సినిమాలు పనికిరావు.

Who insulted Nithiin saying you are a hero

ఇండస్ట్రీ నుండి వెళ్లి ఏవైనా బిజినెస్ లు చేసుకో అదే నీకు మంచిది అంటూ ఘోరంగా అవమానించారట. కానీ ఆ తర్వాత నితిన్ చేసిన ఇష్క్,గుండెజారి గల్లంతయ్యిందే వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ అవడంతో ఎవరైతే నితిన్ ని తిట్టారో మళ్లీ ఆయనే వచ్చి సారీ ఆరోజు అలా తిట్టినందుకు అని నితిన్ ని హగ్ చేసుకుని మరీ క్షమాపణలు కోరారట. అలా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నితిన్ బయటపెట్టారు.(Nithiin)

Join WhatsApp