Who is the actress who said no to marriage with Manchu Manoj?

Manchu Manoj: డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు మ‌నోజ్.. చైల్ట్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి, ఆ త‌ర్వాత హీరోగా మారాడు. 2004లో వ‌చ్చిన దొంగ దొంగది మ‌నోజ్ హీరోగా చేసిన తొలి చిత్రం. ఆపై వ‌రుస సినిమాలు చేశాడు. స్టార్ హీరోగా ఎద‌గ‌లేక‌పోయినా.. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం మ‌నోజ్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. 2018 త‌ర్వాత అత‌ని నుంచి మ‌రో సినిమా రాలేదు.

Who is the actress who said no to marriage with Manchu Manoj?

అయితే గ‌త కొద్ది రోజుల నుంచి ఈయ‌న ఉస్తాద్ అనే షోకు హోస్ట్ గా చేస్తున్నాడు. ఈ షో సూప‌ర్ స‌క్సెస్ అయింది. ఇప్ప‌టికే ఉస్తాద్ షోకు చాలా మంది సెల‌బ్రిటీలు గెస్ట్‌లుగా వ‌చ్చి సంద‌డి చేశారు. మంచు మ‌నోజ్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. 2015లో ఈయ‌న ప్రణతి రెడ్డిని ప్రేమించి పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. అయితే మ‌నోజ్‌-ప్ర‌ణ‌తిల బంధం ఎక్కువ కాలం సాగ‌లేదు. 2019లో ఈ జంట పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

Who is the actress who said no to marriage with Manchu Manoj?

ఆ త‌ర్వాత మ‌నోజ్ భూమా మౌనికా రెడ్డిని 2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్ద‌రికీ రెండో వివాహ‌మే కాగా.. మ‌నోజ్‌ తండ్రి మోహ‌న్ బాబు, అన్న మంచు విష్ణు మౌనిక‌ను అంగీక‌రించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ మ‌నోజ్ వారిని లెక్క‌చేయ‌కుండా మౌనిక‌తో ఏడ‌డుగులు వేశాడు. త్వ‌ర‌లో ఈ దంప‌తులు ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మ‌నోజ్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. మ‌నోజ్ ని పెళ్లి చేసుకోమ‌ని మోహ‌న్ బాబు స్వ‌యంగా ఓ న‌టిని అడిగార‌ట‌. కానీ ఆమె మాత్రం నో అని చెప్పింద‌ట‌. ఇంత‌కీ ఆ న‌టి ఎవ‌రో కాదు శ్రేష్ఠ. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈమె సమరసింహారెడ్డి, హిట్లర్, రౌడీ అల్లుడుతో స‌హా వంద‌కు పైగా చిత్రాల్లో న‌టించింది.(Manchu Manoj)

Also Read: Aksha Pardasany: గోవాలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్‌.. వ‌రుడి ఎంట్రీ చూస్తే ప‌డి ప‌డి న‌వ్వుతారు!

సీనియ‌ర్ ఎన్టీఆర్‌, మోహ‌న్ బాబు కాంబోలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మేజర్ చంద్రకాంత్ మూవీలో శ్రేష్ఠ న‌టించింది. ఈ మూవీలో మ‌నోజ్ కూడా న‌టించాడు. అప్ప‌టి నుంచే ఇద్ద‌రికీ మంచి ప‌రిచ‌యం ఉంది. యూఎస్ లో చ‌దువుకున్న శ్రేష్ఠ కు మంచు ఫ్యామిలీ నుంచి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందట‌. మనోజ్ ని చేసుకోమని మోహ‌న్ బాబు స్వ‌యంగా శ్రేష్ఠ త‌ల్లిదండ్రుల‌ను అప్రోచ్ అయ్యార‌ట‌. కానీ, శ్రేష్ఠ మాత్రం ఒప్పుకోలేదు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా అంగీక‌రించింది. అయితే మ‌నోజ్ ను పెళ్లి చేసుకోవ‌డానికి ఎందుకు ఒప్పుకోలేద‌ని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా.. అవ‌న్నీ ఇప్పుడు వ‌ద్దంటూ శ్రేష్ఠ స‌మాధానం దాట‌వేసింది. అలాగే మనోజ్ ని చేసుకోమని మోహన్ బాబు మొదటి పెళ్లి కోసం అడిగారా లేక రెండవ పెళ్లా అనేది కూడా క్లారిటీ ఇవ్వ‌లేదు.

Join WhatsApp