Who is the celebrity who sent engagement ring to Mrunal Thakur

Mrunal Thakur: సీతారామం సినిమాతో ఎక్కడలేని క్రేజ్ సంపాదించింది నటి మృణాల్ ఠాకూర్.ఇక ఈ సినిమాలో నటించక ముందు కొన్ని బాలీవుడ్ సినిమాల్లో అలాగే బాలీవుడ్ సీరియల్స్ లో నటించిప్పటికి అంతగా గుర్తింపు అయితే రాలేదు. ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ కి వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు సీతారామం సినిమా తర్వాత వచ్చిన హాయ్ నాన్న మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Who is the celebrity who sent engagement ring to Mrunal Thakur

ఇక రీసెంట్గా విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఓటిటిలో మాత్రం ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే హీరో హీరోయిన్ల గురించి ఏ చిన్న విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అయితే అలాంటి ఒక విషయమే మృణాల్ ఠాగూర్ గురించి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. (Mrunal Thakur)

Also Read: Sruthi Haasan: శృతిహాసన్ బ్రేకప్ కి కారణం ఆ డైరెక్టరేనా..?

అదేంటంటే మృణాల్ ఠాకూర్ కి ఒక సెలబ్రిటీ ఎంగేజ్మెంట్ రింగ్ పంపించారట. మరి ఇంతకీ ఆయన ఎవరు.. ఎందుకు ఎంగేజ్మెంట్ రింగ్ పంపించారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ లో హాస్యనటుడిగా.. యూట్యూబర్ గా.. నిర్మాతగా.. ఎంతోమంచి గుర్తింపు సంపాదించిన తన్మయ్ భట్ అంటే తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. అయితే తాజాగా ఈయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఈవెంట్ కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ వీరందరినీ పరిచయం చేయడానికి నేను ఉన్నాను

Who is the celebrity who sent engagement ring to Mrunal Thakur

కానీ నా లైఫ్ పార్ట్నర్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయడానికి ఎవరున్నారో అని రాసుకోచ్చాడు అయితే దీనికి మృణాల్ ఠాగూర్ స్పందిస్తూ మరి మీకు అమ్మాయి దొరికేసిందా అని కామెంట్ పెట్టింది. ఇక దానికి తన్మయ్ బట్ రిప్లై ఇస్తూ.. అదేంటి నీకు నిన్ననే కదా ఎంగేజ్మెంట్ రింగ్ పంపించాను అంటూ స్పందించాడు. దీంతో వీరికి సంబంధించినవి కన్వర్జేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ కన్వర్జేషన్ చూసిన సోషల్ మీడియా జనాలు ఇదేంటి మృణాల్ ఠాగూర్ కి నిజంగానే ఆయన ఎంగేజ్మెంట్ రింగ్ పంపించారా..లేక ఫన్నీగా మాట్లాడుకుంటున్నారా అని కామెంట్స్ పెడుతున్నారు.(Mrunal Thakur)

Join WhatsApp